Snake Caught Slipper: తనపైకి విసిరిన చెప్పును ఎత్తుకుపోయిన పాము.. వీడియో వైరల్

సాధారణంగా పాములు ఎలుకలు, కప్పలు, తొండలను తింటుంటాయి.అలానే ఇవి ఆహారం మాత్రమే తమ నోట కరుచుకొని వెళ్ళిపోతుంటాయి.

 Snake Slithers Away With Slipper Video Viral Details, Snake, Chappal, Slippers,-TeluguStop.com

మిగతా వస్తువులను ఏవీ ఎత్తుకెళ్ళవు.కానీ తాజాగా ఒక పాము ఒక స్లిప్పర్ లేదా చెప్పును నోట కరుచుకొని ఎస్కేప్ అయింది.

దాంతో ఆ చెప్పుల యజమాని అవాక్కయ్యారు.ఈ దొంగతనానికి సంబంధించిన వీడియో వైరల్ గా కూడా మారింది.

వైరలవుతున్న వీడియోలో ఒక పెద్ద పాము ఒకరి ఇంట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నట్లు చూడవచ్చు.

ఆ పాము నేలపై వేగంగా పాక్కుంటూ తమ ఇంటి వైపే వస్తుండటంతో ఆ ఇంటి యజమాని దానిని గద్దాయించింది.

కానీ ఆ పాము అలాగే తమ ఇంట్లోకి వస్తుంటే దానిని ఆపేందుకు తన చెప్పును పాము కేసి విసిరింది.వెంటనే ఉలిక్కిపడ్డ ఆ పాము వెనక్కి వెళ్ళింది.

అనంతరం చెప్పును తన నోట కరుచుకుని అక్కడి నుంచి పరార్ అయింది.ఈ దృశ్యాన్ని చూసి ఆ యజమాని షాక్ అయింది.

నా చెప్పు నాకు ఇవ్వు అంటూ దానిపై ఆమె అరుస్తూ ఉంది.అయినా కూడా ఆ పాము చెప్పు పట్టుకుని వేగంగా పొదల్లోకి వెళ్లిపోయింది.

ఈ వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి పర్వీన్ కశ్వాన్ ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.‘ఈ పాము ఆ స్లిప్పర్ తీసుకుపోయింది.నిజానికి దీనికి కాళ్లు కూడా లేవు ఆ చెప్పులు తీసుకెళ్లి ఏం చేస్తుందో ఏమో” అని ఒక ఫన్నీ క్యాప్షన్‌ను కూడా యాడ్ చేశారు.ఈ వీడియోను చూసి నెటిజన్లు బాగా నవ్వుకుంటున్నారు.

కోరలు చెప్పులో దిగడం వల్ల ఇలా జరిగి ఉంటుందేమో అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.ఈ ఆశ్చర్యకరమైన వీడియోని మీరు కూడా ఓసారి చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube