Russia Ukraine : ఉక్రెయిన్ లోని భారత విద్యార్ధులకు రష్యా గుడ్ న్యూస్ ...!!

ఎంతో మంది భారతీయులు వైద్య విద్య లో పట్టబద్రులు కావటం కోసం ఉక్రెయిన్ కు వెళ్ళటానికి మొగ్గు చూపుతారు.భారత్ లో వైద్య విద్యకు భారీగా ఖర్చు అవ్వడం, ఉక్రెయిన్ లో తక్కువ ఖర్చుతోనే వైద్య విద్య పూర్తవుతున్న నేపధ్యంలో వైద్య వృత్తిని చేపట్టటమే లక్ష్యంగా వందలమంది విద్యార్ధులు ఉక్రెయిన్ వెళ్లి ఎన్నోరకాలైన సవాళ్ళను ఎదురుకుంటూ విద్యను కొనసాగిస్తుంటారు.

 Russia Offer For Indian Medical Students Who Left Ukraine,russia,ukraine,indian-TeluguStop.com

ఆ విధంగానే వెళ్ళిన కొంతమంది భారతీయ విద్యార్ధులు రష్యా,ఉక్రెయిన్ ల మధ్య జరుగుతున్న భీకర దాడుల నేపధ్యంలో తమ చదువు కొనసాగించే దారి లేక, మధ్యలోనే వైద్య విద్యను వదిలి పెట్టలేక మానసికంగా నలిగిపోయారు…ఈ క్రమంలో

రష్యా భారతీయ విద్యార్ధుల కోసం ఓ కీలక ప్రకటన చేసింది.“ఉక్రెయిన్ వీడిన భారత మెడికల్ విద్యార్ధులు (ఇండియన్ మెడికల్ స్టూడెంట్స్) రష్యా లో తమ చదువును కొనసాగించవచ్చని , రెండు దేశాల సిలబస్ ఒకేలా ఉంటుంది, పైగా ఉక్రెయిన్ లో చాలా మంది రష్యాలో మాట్లాడతారు కాబట్టి భాషా సమస్య కూడా ఉండదని,అందువలన ఉక్రెయిన్లోని భారతీయ మెడికల్ స్టూడెంట్స్ కు సాదర స్వాగతం.

” అంటూ చెన్నైలోని రష్యా రాయబారి ఓలెగ్ ఆవడీన్ తాజాగా ప్రకటించారు.ఈ క్రమంలోనే భారత్, రష్యా చమురు దిగుమతులను గురించి కూడా ప్రస్తావిస్తూ “ఈ ఏడాదిలో రష్యా చమురు ఎగుమతులు 22శాతానికి పెరిగాయని” తెలియచేశారు.


Telugu Indian Medical, Jai Shankar, Russia, Russianconsul, Russian, Ukraine-Telu

కాగా, రష్యా, భారత్ చమురు దిగుమతులపై కేంద్ర మంత్రి జై శంకర్ గతంలో చేసిన వ్యాఖ్యలను మరల గుర్తుచేస్తూ, “రష్యా బంధం భారత్ కు ప్రయోజనం చేకూర్చిందని, దీన్ని కేంద్రం కొనసాగించాలని అనుకుంటోందని “ కేంద్ర మంత్రి ప్రస్తావించారు.అయితే, ఈ వ్యాఖ్యలను ఒలేగ్ ప్రశంసిస్తూ, పై చదువుల కోసం రష్యాకు వచ్చే భారతీయుల సంఖ్య క్రమంగా పెరుగుతోందని, రష్యా స్కాలర్ షిప్ కోసం ఎంతో మంది ధరఖాస్తు చెసుకుంటున్నారని తెలిపారు.ఇదిలాఉంటే యుద్ద సమయంలో ఉక్రెయిన్ నుంచీ భారత్ వచ్చేసిన ఎంతో మంది వైద్య విద్యార్ధులు వారి వైద్య విద్య కొనసాగింపు పై కేంద్రం ఎలాంటి భరోసా ఇవ్వకపోవడంతో తిగిరి ఉక్రెయిన్ వెళ్ళిపోగా ప్రస్తుత పరిస్థితుల నేపధ్యంలో తిరిగి వచ్చేయమని కేంద్రం హెచ్చరించినా ససేమిరా అంటున్నారు విద్యార్ధులు.తాజాగా రష్యా భారత విద్యార్ధులకు ఇచ్చిన ఈ ఆఫర్ తో విద్యార్ధులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube