తెలంగాణ సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మండిపడ్డారు.కేసీఆర్ వ్యవహరించే తీరు కారణంగా రాష్ట్రం నష్టపోతోందని విమర్శించారు.
గతంలో ప్రధాని మోదీకి కేసీఆర్ పరోక్షంగా మద్ధతు తెలిపారని ఆరోపించారు.అలాంటప్పుడు ప్రధాని తెలంగాణ పర్యటనకు వస్తే కేసీఆర్ ముఖం చాటేయడం ఎందుకని ప్రశ్నించారు.
కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా వస్తే తెలంగాణ రాష్ట్ర ప్రజలపై పడ్డ లక్ష కోట్ల భారం తగ్గేదని తెలిపారు.కేసీఆర్ వైఖరితో హక్కుగా పొందాల్సిన అవకాశాన్ని కోల్పోతున్నామని విమర్శించారు.