America Abhishek Krishnan : కోవిడ్ రిలీఫ్ స్కీమ్‌ పేరుతో మోసం.. భారతీయుడిపై అభియోగాలు, నేరం రుజువైతే 20 ఏళ్ల జైలు..?

కోవిడ్ రిలీఫ్ స్కీమ్ పేరుతో దాదాపు 8 మిలియన్ డాలర్ల మేర మోసానికి పాల్పడిన భారతీయుడిపై అమెరికా పోలీసులు అభియోగాలు మోపారు.కోర్టుకు సమర్పించిన పత్రాల ప్రకారం.

 Indian National Charged In America With Usd 8 Million Covid Relief Fraud Scheme-TeluguStop.com

అతని నేరం రుజువైతే 20 ఏళ్ల వరకు జైలు శిక్ష పడుతుందని నిపుణులు అంటున్నారు.నిందితుడిని అభిషేక్ కృష్ణన్‌గా (40) గుర్తించారు.

ఇతను అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రంలో నివసించేవాడు.కరోనా వైరస్ ఎయిడ్, రిలీఫ్ అండ్ ఎకనామిక్ సెక్యూరిటీ (కేర్స్) కింద స్మాల్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఎస్‌బీఏ) హామీ ఇచ్చిన పేచెక్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్‌ (పీపీపీ) లోన్‌లలో మిలియన్ డాలర్లను మోసపూరితంగా పొందినట్లు అతనిపై న్యూజెర్సీ రాష్ట్రం నెవార్క్‌లోని ఫెడరల్ గ్రాండ్ జ్యూరీ అభియోగాలు మాపింది.

అభిషేక్‌పై రెండు కౌంట్ల వైర్ ఫ్రాండ్, రెండు కౌంట్ల మనీలాండరింగ్, రెండు కౌంట్ల దొంగతనం అభియోగాలు నమోదు చేశారు.నేరం రుజువైతే అతను గరిష్టంగా 20 ఏళ్ల జైలు శిక్షను ఎదుర్కొంటాని, లేనిపక్షంలో ప్రతి కౌంట్‌పై కనీసం రెండేళ్ల జైలు శిక్షను అనుభవించాల్సి వుంటుందని నిపుణులు చెబుతున్నారు.

కోర్టుకు సమర్పించిన పత్రాల ప్రకారం… అభిషేక్ భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత అనేక మోసపూరిత పీపీపీ రుణ దరఖాస్తులను పలు బ్యాంకులకు సమర్పించినట్లు తేలింది.ఈ దరఖాస్తులలో కంపెనీల ఉద్యోగులు, పేరోల్ ఖర్చుల గురించి తప్పుడు ప్రకటనలు, నకిలీ ఫైలింగ్‌లు వున్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు.

Telugu America, Covid Scheme, Indiannational, Krishnan-Telugu NRI

కుట్రలో భాగంగా కృష్ణన్.మరో వ్యక్తి అనుమతి లేకుండా అతని పేరును ఉపయోగించాడు.తద్వారా మొత్తం 8.2 మిలియన్ డాలర్లకు పైగా క్లెయిమ్ కోరుతూ 17 లోన్ అప్లికేషన్లను సమర్పించాడు.ఇందులో 3.3 మిలియన్లకు పైగా అందుకున్నాడు.అలా అక్రమంగా పొందిన నిధులను కృష్ణన్ మనీలాండరింగ్ చేసినట్లు తేలింది.మరో కేసులో ఫెడరల్ ప్రభుత్వం నిధులు సమకూర్చిన నిరుద్యోగ బీమా ప్రయోజనాలను పొందినందుకు గాను ఇటీవల అతనిపై నార్త్ కరోలినాలోని ఈస్ట్ జిల్లాలో ప్రభుత్వ ఆస్తుల దొంగతనం అభియోగాలు నమోదు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube