ఈ మధ్యకాలంలో కన్నడ ఇండస్ట్రీతో పాటు బాలీవుడ్ టాలీవుడ్ ఇండస్ట్రీలలో కన్నడ నిర్మాణ సంస్థ అయిన హోంబలే ఫిల్మ్స్ గురించి సర్వత్ర చర్చించుకుంటున్న విషయం అందరికి తెలిసిందే.ఈ మధ్యకాలంలో ఈ హోంబలే ఫిలిమ్స్ సంస్థ నిర్మాణంలో తెరరకెక్కిన సినిమాలు అన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ లుగా నిలుస్తున్నాయి.
మరి ఈ నిర్మాణ సంస్థకు హోంబలే నిర్మాణ సంస్థ అని ఏ విధంగా పేరు వచ్చింది.దాని సృష్టికర్త లు ఎవరు అన్న విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
విజయ్ కిరంగదూర్, చలువే గౌడ, కార్తిక్ గౌడ ఈ ముగ్గురి సృష్టే హోంబలే ఫిల్మ్స్.ఇలవేల్పు హోంబలమ్మ కావడంతో నిర్మాణ సంస్థకు హోంబలే ఫిల్మ్స్ అనే పేరును పెట్టారు.
అవగాహన రాహిత్యంతో తీసిన మొదటి సినిమా ఊహించని విధంగా ప్లాప్ అయ్యింది.కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ తో నిన్నిందలే సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది.
కాగా ఈ సినిమాలు విడుదల అయినా తరువాత ఆ సినిమాల పై కసితో ఏడాది తిరిగేలోపు మాస్టర్‌పీస్ అనే సినిమాతో యశ్ హీరోగా తెరకెక్కించారు.ఈ చిత్రంలోనే హోంబలే ఫిల్మ్స్ ప్రయాణం మొదలైంది.
అంతేకాకుండా హోంబలే పేరును అందరికీ పరిచయం చేసింది ఈ మాస్టర్ పీస్ సినిమా అని చెప్పవచ్చు.ఆ తర్వాత వరుసగా రాజకుమార, యువరత్న, కేజీయఫ్ చాప్టర్ 1, కేజీయఫ్ చాప్టర్ 2, కాంతారా లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు హోంబలే హిట్లు లిస్టులో చేరిపోయాయి.యష్ హీరోగా నటించిన కేజీయఫ్ చాప్టర్ 1 సినిమాతో కన్నడ నాట వరకు మాత్రమే పరిమితమైన వీరి పేర్లు ఈ సినిమా తర్వాత దేశవ్యాప్తంగా భారీగా పాపులారిటీని సంపాదించుకున్నారు.ఇక కేజీయఫ్ చాప్టర్ 2 సినిమా ఏకంగా రూ.1250 కోట్ల కలెక్షన్స్ ను కొల్లగొట్టింది.ఆ తర్వాత కేవలం రూ.16 కోట్లతో నిర్మించిన కాంతార సినిమా కూడా ఊహించని విధంగా పాపులారిటీ సాధించుకోవడంతోపాటు కేజీఎఫ్ లాంటి సినిమాల రికార్డులను కూడా బద్దలు కొట్టింది.ఇకపోతే ప్రస్తుతం హోంబలే సంస్థ ప్రభాస్ హీరోగా సలార్, టైసన్, భగీర, రిచర్డ్ ఆంథోనీ, ధూమం లాంటి సినిమాలను నిర్మిస్తోంది .