నందమూరి బాలకృష్ణ మొట్టమొదటి సారిగా హోస్ట్ గా చేసిన షో ‘అన్ స్టాపబుల్’.అత్యంత ప్రజాదరణ పొందిన టాక్ షోలలో నందమూరి బాలకృష్ణ షో టాప్ లో నిలిచింది.
ఆహా ఓటిటి లో స్టార్ట్ అయినా ఈ షో అందరి అంచనాలను మించి సూపర్ డూపర్ హిట్ అయ్యింది.ఇక సీజన్ 1 ఘన విజయం సాధించడంతో సీజన్ 2 స్టార్ట్ చేసారు.
సీజన్ 2 కోసం ప్రేక్షకులంతా ఎదురు చూస్తున్నారు.ఎప్పుడెప్పుడు ఈ సీజన్ వస్తుందా అని ఎదురు చూసే ప్రేక్షకులకు బాలయ్య ఇటీవలే సర్ప్రైజ్ ఇచ్చాడు.ఈ సీజన్ 2 అక్టోబర్ 14న స్టార్ట్ అయ్యింది.మొదటి ఎపిసోడ్ లో బాలయ్య చంద్రబాబును, అల్లుడు లోకేష్ ను తీసుకు వచ్చాడు.
ఆ తర్వాత రెండవ ఎపిసోడ్ లో సిద్ధూ జొన్నలగడ్డ తో పాటు మరొక హీరో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కూడా బాలయ్యతో ముచ్చటించారు.ఈ రెండు ఎపిసోడ్స్ సూపర్ హిట్ అవ్వడంతో మూడవ ఎపిసోడ్ కోసం ప్రేక్షకుల్లో ఆత్రుత మరింత పెరిగి పోతుంది.
ఈ క్రమంలోనే ఈసారి సీజన్ లో ముందు ముందు ఎవరు వచ్చే అవకాశం ఉంది అంటూ నెట్టింట అనేక వార్తలు వైరల్ అవుతున్నాయి.ఈ నేపథ్యంలోనే మంత్రి, హీరోయిన్ అయినా రోజా కూడా అన్ స్టాపబుల్ షోలో సందడి చేయబోతుంది అంటూ వార్తలు వస్తున్నాయి.
సీజన్ 1 అప్పుడు కూడా ఈమె షోలో పాల్గొంటుంది అని రూమర్స్ బాగా వచ్చాయి.ఇక ఇప్పుడు కూడా ఈ క్రేజీ రూమర్ తెరపైకి వచ్చింది.
ఈ వార్తలు బాగా వైరల్ అవుతుండడంతో జనాలు కూడా రోజా ఈ షోకు వస్తుందా? రాదా? అనే విషయం తెగ చర్చించు కుంటున్నారు.వ్యక్తిగతంగా రోజాకు బాలకృష్ణకు మంచి సంబంధాలు ఉన్నాయి.
పలుసార్లు బహిరంగంగానే ఈ విషయం కన్ఫర్మ్ అయ్యింది.కానీ రాజకీయంగా తీసుకుంటే మాత్రం వీరిద్దరూ చెరొక పార్టీ.
దీంతో పాల్గొనక పోవచ్చనే చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.అందుకే ఇప్పుడు ఈ గాసిప్ నెట్టింట హల్ చల్ చేస్తుంది.
చూడాలి ఏం జరుగుతుందో.