మన తెలుగు చిత్ర పరిశ్రమకు సంక్రాంతి, దసరా, దీపావళి వంటి పండుగలు పెద్ద పండగలు అని చెప్పాలి.ఈ పండుగలకు భారీ సినిమాలు రిలీజ్ అవుతాయి.
పెద్ద పెద్ద సినిమాల రిలీజ్ డేట్ లను ఈ పండుగలకు ఫిక్స్ చేసుకుంటారు.ఎందుకంటే పండుగ సీజన్ లో కొద్దిగా పాజిటివ్ టాక్ వచ్చిన కలెక్షన్స్ మోత మోగించడం ఖాయం.
అందుకే ఈ పండుగలనే టార్గెట్ చేసుకుని తమ సినిమాలను రిలీజ్ చేస్తుంటారు స్టార్స్.
అయితే ఉత్తరాది ప్రేక్షకులకు మాత్రం దీపావళి, రంజాన్ వంటి పండుగలనే ఎక్కువ టార్గెట్ చేస్తుంటారు.
కారణం ఈ సీజన్ లలో రిలీజ్ అయితే వందల కోట్లు వసూళ్లు చేయడమే కాకుండా కొత్త రికార్డులను నెలకొల్పుతాయి.ఇది కొన్నేళ్లుగా ఉత్తరాదిన జరుగుతుంది.అయితే ఈసారి మాత్రం దీపావళి పండుగ కల ఏ మాత్రం కనిపించడం లేదు.
మరి ఈసారి ఎందుకు బాలీవుడ్ పట్టించు కోవడం లేదో తెలియడం లేదు కానీ ఈ సీజన్ ను మాత్రం కంప్లీట్ గా చేతులెత్తేసినట్టు కనిపిస్తుంది.
గతంలో బాలీవుడ్ ఎంతో ఆర్బాటంగా సినిమాలను ప్రోమోట్ చేసేది.కానీ ఈసారి అక్షయ్ కుమార్ రామ్ సేతు సినిమాతో అజయ్ దేవగణ్ థాంక్ గాడ్ సినిమాతో రాబోతున్నారు.
కానీ ఈ సినిమాల విషయంలో కొద్దిగా కూడా బజ్ లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.
ఈ సినిమాలపై ప్రేక్షకుల్లో మాత్రమే కాదు ఆ సినిమా మేకర్స్ విషయంలో కేసుల అంతగా ఆత్రుత, ఆసక్తి కనిపించడం లేదు.పెద్దగా ప్రొమోషన్స్ చేసేందుకు ఆసక్తి చూపించడం లేదు.ఈ పండుగ సీజన్స్ లో ప్రొమోషన్స్ చేస్తే మంచి కలెక్షన్స్ రాబట్టడం ఖాయం.
కానీ మేకర్స్ మాత్రం సీరియస్ గా తీసుకోకుండా ప్రొమోషన్స్ మీద ఏ మాత్రం ద్రుష్టి పెట్టడం లేదు.దీంతో ఓపెనింగ్స్ కూడా కష్టమే అంటూ తెల్చిపారేస్తున్నారు విశ్లేషకులు.
ఈ రెండు కేసుల డిజాస్టర్స్ అయితే కాంతారా కాసుల వర్షం కురిపించడం ఖాయం.