అక్కినేని అఖిల్ ప్రెసెంట్ నటిస్తున్న సినిమా ఏజెంట్.సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటుంది.
ఈ సినిమాలో అఖిల్ కు జోడీగా కొత్త బ్యూటీ సాక్షి వైద్య నటిస్తున్న విషయం విదితమే.మోడల్ అయిన ఈమె ఏజెంట్ సినిమాతోనే తెలుగు తెరకు పరిచయం అవుతుంది.
ఈమెకు ఏజెంట్ సినిమా తర్వాత వరుస ఆఫర్స్ వస్తాయి అని ఒకానొక సమయంలో అఖిల్ మాత్రమే కాదు సురేందర్ రెడ్డి కూడా తెలిపారు.
అయితే ఏజెంట్ సినిమా షూటింగ్ ఆలస్యం అవ్వడం వల్ల అనుకున్న సమయానికి రిలీజ్ చేయలేక పోతున్నారు.
అయినా కూడా ఈ సినిమాలో హీరోయిన్ కు సెకండ్ ఛాన్స్ వచ్చినట్టు సమాచారం.మొదటి సినిమా రిలీజ్ కాకుండానే సెకండ్ ఛాన్స్ అందుకుని ఈమె టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది.
తాజాగా అందుతున్న సమాచారం ఈమె రామ్ కు జోడీగా ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది.రామ్ పోతినేని ప్రెజెంట్ బోయపాటి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు.
మరి తాజాగా బోయపాటి రామ్ కోసం ఈ బ్యూటీనే ఎంపిక చేసినట్టు సమాచారం.బోయపాటి పెట్టిన లుక్ టెస్ట్, ఇతర టెస్టుల్లో కూడా ఈమె పాస్ అవ్వడంతో ఈమెను హీరోయిన్ గా ఫిక్స్ చేసారని సమాచారం.
ఏజెంట్ సినిమా రిలీజ్ కాకుండానే సాక్షి వైద్య కు మరో ఆఫర్ రావడంతో ఈమె లక్ బాగుంది అంటున్నారు.మరి ముందు ముందు ఈమె కూడా స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు అంటున్నారు విశ్లేషకులు.
ఇక బోయపాటి తో చేసే సినిమా ఇటీవలే పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా లాంచ్ అయ్యింది.పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు కూడా టాక్ బయటకు వచ్చింది.రామ్ కెరీర్ లో 20వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై నిర్మిస్తుండగా.మ్యూజిక్ డైరెక్టర్ గా థమన్ ను ఫిక్స్ చేసారు.