వాట్సప్‌ వినియోగదారులకు కొత్త అప్డేట్... ఇకనుండి అలా వాడుకోవచ్చు!

ప్రపంచ మెసేజింగ్ దిగ్గజం వాట్సప్ తన వినియోగదారులను దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో దూసుకుపోతోంది.వాట్సప్ మెసేజ్ యాప్‌లో ఇప్పటికే ఎన్నో ఫీచర్లు ఉండగా, వారానికొకటి చొప్పున ఏదో ఒక ఫీచర్ యాడ్ చేసుకుంటూ పోతోంది.

 A New Update For Whatsapp Users From Now On You Can Use It , Whatsapp, Technolo-TeluguStop.com

ఈ క్రమంలో ఈ వారం నుంచి మరో 2 కొత్త ఫీచర్లు వినియోగదారులకి అందుబాటులోకి రానున్నాయి.ఇక నుంచి వాట్సప్ వాయిస్ కాల్, వీడియో కాల్ లో జాయిన్ కావాలంటూ ఇతరులకు లింక్ సెండ్ చేసి మరీ ఆహ్వానం పలకవచ్చు.

వాట్సప్‌లో వాయిస్ కాల్ లేదా వీడియో కాల్ ద్వారా ఒకరికి లేదా అంత కంటే ఎక్కువ మందికి ఒకే సారి ఫోన్ చేయవచ్చు.

ఇదే సూపర్ కదూ.ఇక ఈ ఫీచర్ ఎలాంటి సందర్భాలలో ఉపయోగపడనుంది అంటే, ఎక్కువ మందికి ఒకేసారి కాల్ చేసినప్పుడు బిజీ వల్ల కొందరు లిఫ్ట్ చేసే అవకాశం ఉండకపోవచ్చు.అలాగే పని వేళల్లో కాల్ చేస్తే కొందరికి ఇబ్బందిగా ఉండొచ్చు.

అయితే వాట్సప్‌లో రానున్న ఈ రెండు కొత్త ఫీచర్ల ద్వారా వాట్సప్ వాయిస్ కాల్, వీడియో కాల్‌లో జాయిన్ కావాలంటూ ఒక లింక్ సెండ్ చేయవచ్చు.తద్వారా ఆసక్తి ఉన్నవారు ఆ లింక్‌ని క్లిక్ చేసి కాల్‌లో జాయిన్ కావొచ్చు.

లేదంటే బిజీగా ఉండి కాల్ చూసుకోలేకపోయినవారు తర్వాత ఆ లింక్ క్లిక్ చేసి కాల్‌లోకి యాడ్ కావొచ్చు.

Telugu Latest, Whatsapp-Latest News - Telugu

సూపర్ కదూ! ఈ రెండు ఫీచర్లు పొందడానికి ఇప్పటికే వాట్సప్ వాడుతున్నవారు యాప్‌ని ఒకసారి అప్డేట్ చేసుకొని వాడితే సరిపోతుంది.ఈ వారం నుంచే ఈ రెండు ఫీచర్లు అందుబాటులోకి వస్తాయని వాట్సప్ మాతృ సంస్థ మెటా సీఈవో మార్క్ జుకెర్ బర్గ్ ఫేస్ బుక్ ద్వారా తాజాగా వెల్లడించారు.అలాగే వాట్సాప్‌లో ఒకేసారి 32 మంది గ్రూప్ వీడియో కాల్ మాట్లాడుకునే వీలు కల్పించేందుకు కూడా ప్రయత్నిస్తున్నట్లు ఆయన చెప్పారు.

ఇందుకు సంబంధించి ట్రయల్స్ జరుగుతున్నట్లు తెలిపారు.అది కూడా త్వరలో వినియోగంలోకి వస్తున్నట్టు భోగట్టా.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube