నిరాహార దీక్షను ప్రారంభించిన సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎర్ర శ్రీకాంత్.

ఖమ్మం నియోజకవర్గ ప్రజలకు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను వెంటనే అమలు అయ్యేలా చూడాలని సీపీఎం పార్టీ జిల్లా రాష్ట్ర కమిటీ సభ్యులు ఏరా శ్రీకాంత్ డిమాండ్ చేశారు.పార్టీ వన్ టౌన్ కమిటీ ఆధ్వర్యంలో 39 డివిజన్ మేదర బజారు సెంటర్ ఒక రోజు దీక్ష చేపట్టారు.

 Cpm State Committee Members Erra Srikanth Who Started The Hunger Strike , Erra-TeluguStop.com

ఈ దీక్షా శిబిరాన్ని ఎర్ర శ్రీకాంత్ గారు ప్రారంభం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 9 సంవత్సరాల కాలంలో కేవలం 2300 డబుల్ బెడ్ రూం ఇళ్ళు మాత్రమే ఇచ్చారని, మిగతా ఐదు వేల డబుల్ బెడ్ రూం ఇళ్ళు ఇంకా ఎంతకాలం పట్టిందో జిల్లా ప్రజా ప్రతినిధులు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

నగరంలో పెన్షన్ లు మంజూరు చెయ్యడంలో కూడా తెరాస నాయకులు రాజకీయం చేస్తున్నారు అని, తక్షణమే అర్హత వున్నవారికి వెంటనే పెన్షన్ లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.రేషన్ కార్డులు మంజూరు చెయ్యడంలో విఫలం చెందారని ఆరోపించారు.

నగరంలో ప్రజలకు పలు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.రాబోయే కాలంలో పెండింగ్లో ఉన్న ప్రజా సమస్యలపై ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో ఐద్వా మహిళా సంఘం జిల్లా నాయకులు Sk బేగం.భాగం అజిత.వన్ టౌన్ పార్టీ సీనియర్ నాయకులు లింగయ్య నర్సింగ్ కృష్ణారావు.వన్ టౌన్ కమిటీ సభ్యులు నాగుల్ మీరా భాస్కర్ రాజు కూరపాటి శ్రీనివాస్ రావులపాటి నాగరాజు కూరపాటి సతీష్ యువజన నాయకుడు ఎలగందుల అనిల్ తదితరులు దీక్షలో పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube