ప్రియమణి డ్యాన్స్ ప్రాక్టీస్ చూస్తే షాక్ అవ్వాల్సిందే.. వైరల్ వీడియో!

తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ ప్రియమణి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఒకప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది ప్రియమణి.

 Priyamani Latest Dance Video Viral On Social Media, Priyamani, Dance Video, Soci-TeluguStop.com

మొదట ఎవరే అతగాడు సినిమాతో హీరోయిన్గా పరిచయమైన ప్రియమణి ఆ తర్వాత వరుసగా అవకాశాలు అందుకుంటూ టాప్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.ఈమెకు వెండితెరపై మాత్రమే కాకుండా బుల్లితెర పైన కూడా విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది.

ప్రస్తుతం సినిమాలలో పాత్రకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు ఎంచుకుంటూ దూసుకుపోతోంది.

అలాగే బుల్లితెరపై ప్రసారమయ్యే పలు షోలకూడా జడ్జిగా కూడా వ్యవహరిస్తోంది.

మరి ముఖ్యంగా తెలుగులో ఈటీవీలో ప్రసారమవుతున్న ఢీ షోలి జెడ్జ్ గా వ్యవహరించడంతోపాటు అప్పుడప్పుడు శేఖర్ మాస్టర్ తో కలిసి స్టెప్పులను కూడా ఇరగదీసింది.ఇది ఇలా ఉంటే తాజాగా ప్రియమణికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఇటీవల తన టీం తో కలిసి డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.ఇక ఆ వీడియోలో ప్రియమణి కష్టపడి డ్యాన్స్ చేస్తూ చెమటలు చిందిస్తోంది.

కాగా ఈ వీడియోని చూసిన అభిమానులు, నెటిజన్స్ ప్రియమణి కీ మళ్ళీ సినిమా అవకాశాలు ఇవ్వండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఇకపోతే ప్రియమణి, ముస్తఫా రాజ్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.ఇప్పటికే తన భర్తను పలు సార్లు స్టేజ్ పై అందరికీ పరిచయం చేసింది ప్రియమణి.మరి అభిమానులు కోరుకుంటున్న విధంగా హీరోయిన్ ప్రియమణికి మళ్లీ సినిమాలలో హీరోయిన్ గా అవకాశాలు ఇస్తారా లేదా చూడాలి మరి.కాగా ప్రియమణి ప్రస్తుతం సినిమాలలో నటిస్తూనే మరొకవైపు బుల్లి తెర పై ప్రసారమయ్యే షోలకు జడ్జిగా వ్యవహరిస్తూ, వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube