ఈ నెల 5వ తేదీన రిలీజ్ కానున్న సినిమాలలో ఒకటైన సీతారామం సినిమాపై క్లాస్ ప్రేక్షకులలో మంచి అంచనాలు నెలకొన్నాయనే సంగతి తెలిసిందే.తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.
తెలుగు రాష్ట్రాల్లో సీతారామం సినిమా బుకింగ్స్ ఆశాజనకంగా లేవు.పాజిటివ్ టాక్ వస్తే మాత్రం ఈ సినిమా బుకింగ్స్ పుంజుకునే అవకాశం ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో దుల్కర్ సల్మాన్ ను అభిమానించే ఫ్యాన్స్ ఎక్కువగానే ఉన్నారు.
దుల్కర్ సల్మాన్ ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మాట్లాడుతూ ప్రేక్షకుల ప్రేమకు కృతజ్ఞతలు అని అన్నారు.
సీతారామం క్లాసిక్ మూవీ అని ఇది రియల్లీ ఒరిజినల్ కథ అని చెప్పుకొచ్చారు.ఇప్పటివరకు సీతారామం లాంటి సినిమా ఎక్కడా రాలేదని దుల్కర్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఈ సినిమా స్క్రీన్ ప్లే నాకు చాలా బాగా నచ్చిందని ట్రైలర్ లో చూసింది గ్లింప్స్ మాత్రమేనని స్క్రీన్ ప్లే ఊహాతీతంగా ఉంటుందని దుల్కర్ చెప్పుకొచ్చారు.
సీతారామం అనే అద్భుతాన్ని వెండితెరపై చూడాలని దుల్కర్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
రోజురోజుకు వయస్సు పెరుగుతోందని విభిన్నమైన పాత్రలను చేయాలని ఉందని దుల్కర్ కామెంట్లు చేశారు.పాటలు విజువల్ వండర్ గా ఉంటాయని తెలుగు అద్భుతమైన భాష అని దుల్కర్ చెప్పుకొచ్చారు.మృణాల్ ఈ సినిమాకు అద్భుతమైన చాయిస్ అనిపించిందని దుల్కర్ కామెంట్లు చేశారు.
సెట్స్ లో మృణాల్ ను చూసిన సమయంలో సీత రోల్ ను ఆమె కాకుండా మరెవరూ చేయలేరేమో అని అనిపించిందని దుల్కర్ పేర్కొన్నారు.ఆఫ్ స్క్రీన్ లో కూడా మృణాల్ హ్యాపీగా ఉంటుందని దుల్కర్ చెప్పుకొచ్చారు.సీతారామంలో రష్మిక గ్రేట్ ఎనర్జీతో కనిపిస్తారని దుల్కర్ కామెంట్లు చేశారు.
రష్మిక తర్వాత ప్రాజెక్ట్ లతో విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.