సెంచరీ పూర్తి చేసుకున్న ఆర్ఆర్ఆర్.. మరొక అరుదైన ఘనత కూడా సాదించిందిగా..

టాలీవుడ్ అగ్ర దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన సినిమా ఆర్ఆర్ఆర్.ఈ సినిమాలో ఇద్దరు టాలీవుడ్ స్టార్స్ నటించారు.

 Rrr Movie Completed 100 Days, Rrr, Rajamouli, Ram Charan, Ntr, Tollywood,alia Bh-TeluguStop.com

ఇది బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా తెరకెక్కింది.ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు గా చరణ్, కొమురం భీం గా ఎన్టీఆర్ నటించిన విషయం తెలిసిందే.

వీరిద్దరూ నటన పరంగా అదరగొట్టారు.ప్రేక్షకుల చేత విజిల్స్ వేయించుకున్నారు.

అభిమానులతో పాటుగా సినీ ప్రముఖులు కూడా ఈ ఇద్దరి హీరోల నటనకు ఫిదా అయ్యారు.నాలుగేళ్ళ నిరీక్షణకు ఫుల్ స్టాప్ పెట్టి ఈ సినిమా వరల్డ్ వైడ్ గా మార్చి 25న రిలీజ్ అయిన విషయం తెలిసిందే.

బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.బాక్సాఫీస్ కలెక్షన్ల ను కొల్లగొట్టింది.అయితే ఇంత ఘన విజయం సాధించిన ఈ సినిమా ఈ రోజుతో 100 రోజులు పూర్తి చేసుకుంది.ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రత్యేకమైన పోస్టర్ ను వదిలారు.

ఈ పోస్టర్ లో ఎన్టీఆర్ ఒకవైపు బైక్ నడుపుతూ ఉంటే.మరొక వైపు చరణ్ గుర్రం స్వారీ చేస్తున్నాడు.

ఈ పోస్టర్ ఇరు హీరోల అభిమానులను అలరిస్తుంది.ఇక ఇది ఇలా ఉండగా ఈ సినిమా మరొక అరుదైన ఘనత కూడా సాధించింది.

హాలీవుడ్ లో మిడిల్ లో వచ్చే అవార్డుల్లో ఆర్ ఆర్ ఆర్ రన్నరప్ గా నిలిచింది.

ఈ విషయాన్నీ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ ద్వారా ప్రకటించడంతో ఈ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అయ్యింది.ఈ అవార్డుల్లో రన్నరప్ గా నిలవడంతో ట్రిపుల్ ఆర్ సినిమాకు ఇంటెర్నేషనల్ వైడ్ గా మరింత గుర్తింపు లభించింది.ఈ సినిమా ప్రెసెంట్ ఓటిటిలో కూడా దుమ్ములేపేలా రికార్డ్ వ్యూస్ సాధిస్తూ ఇక్కడ కూడా అన్ని రికార్డులను క్రియేట్ చేస్తూ దూసుకు పోతుంది.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube