సీఎం పవన్ సీఎం ఎన్టీఆర్.. ఈ హీరోలకే ఇంత క్రేజ్ ఎందుకంటే?

తెలుగు రాష్ట్రాలలో ఎంతోమంది హీరోలు ఉన్నా ఇద్దరు హీరోలు మాత్రమే రాబోయే రోజుల్లో ఏపీకి ముఖ్యమంత్రులు కావాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు.ఆ హీరోలలో ఒకరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాగా మరొకరు జూనియర్ ఎన్టీఆర్ కావడం గమనార్హం.

 Huge Craze For Junior Ntr And Pawan Kalyan Details Here Goes Viral , Huge Craz-TeluguStop.com

ఎన్టీఆర్ టీడీపీ తరపున సీఎం కావాలని ఫ్యాన్స్ కోరుకుంటుండగా పవన్ కళ్యాణ్ జనసేన తరపున సీఎం కావాలని ఆయన అభిమానులు భావిస్తున్నారు.

అయితే ఈ హీరోలకే పాలిటిక్స్ విషయంలో ఇంత క్రేజ్ ఎందుకనే ప్రశ్నకు ఆసక్తికరమైన కారణం వెలుగులోకి వచ్చింది.

ఇద్దరు హీరోలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా రాజకీయాలతో సంబంధం ఉండటంతో పాటు ఈ ఇద్దరు హీరోలు తెలుగు రాష్ట్రాల రాజకీయాలను ప్రభావితం చేసే స్థాయిలో అభిమానులను కలిగి ఉన్నారు.అటు పవన్ కళ్యాణ్ ఇటు జూనియర్ ఎన్టీఆర్ ఇచ్చే స్పీచ్ లకు ఊహించని స్థాయిలో జనాదరణ ఉంది.

జూనియర్ ఎన్టీఆర్ లేదా పవన్ కళ్యాణ్ సీఎం అయితే ఏపీలో మరింత అభివృద్ధి జరుగుతుందని చాలామంది నమ్ముతున్నారు.వ్యక్తిగతంగా ఎటువంటి అవినీతి ఆరోపణలు లేకపోవడం ఈ హీరోలకు ప్లస్ అవుతోంది.

పవన్ కళ్యాణ్ సినిమాల కంటే రాజకీయాలకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుండగా జూనియర్ ఎన్టీఆర్ మాత్రం రాజకీయాల కంటే సినిమాలకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుండటం గమనార్హం.

Telugu Craze, Janasena, Ntr, Pawan Kalyan-Movie

ఈ ఇద్దరు హీరోలలో ఎవరైనా సీఎం అవుతారేమో చూడాల్సి ఉంది.సినిమాల విషయంలో ఈ ఇద్దరు హీరోల పారితోషికం దాదాపుగా ఒకే విధంగా ఉంది.ఒక్కో సినిమాకు ఈ హీరోలు వేర్వేరుగా 60 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నారు.

బ్యాగ్రౌండ్ ఉన్నా తమ టాలెంట్ తోనే పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ ఈ స్థాయికి చేరుకున్నారు.ప్రస్తుతం ఈ ఇద్దరు స్టార్ హీరోలు పాన్ ఇండియా ప్రాజెక్ట్ లతో కెరీర్ విషయంలో బిజీగా ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube