సర్వాంతర్యామి అయిన సర్వేశ్వరుణ్ణి కేవలం దేవాలయానికో, పూజ గదికో పరిమితం చేయరాదు.ఎల్లప్పుడూ ఆయన మనతోనే ఉన్నట్లు భావించటం ఉత్తమం.
ఆ ద్వితీయ పరమాత్మ అంతటా వ్యాపించి ఉన్నట్లు భావించాలి.అలా అని గుడికి వెళ్లాల్సిన అవసరం లేదు, దేవుడిని ప్రార్థించాల్సిన అవరసం లేదు.
అలాగే పూజలు, పునస్కారాలు చేయాల్సిన అవసరం అంతకంటే లేదు అనుకోవడం మాత్రం సరైనది కాదు.ఇంట్లోనూ పూజలు, వ్రతాలు చేయాలి, అలాగే గుడికి కూడా వెళ్లాలి.
మనం చేయాల్సినవి అన్నీ చేస్తూనే ఈ స్వామి వారు ప్రతీ చోట ఉన్నారని గ్రహించాలి.సర్వేశ్వరుడు అర్చా మూర్తిగా ఆలయాల్లో ఉంటూ భక్తుల నివేదనలను స్వీకరిస్తాడు.
కల్ప వృక్షమై వారి కోరికలను తీరుస్తాడు.దైవాన్ని సర్వ జీవులలో చూడాలి.
అందరికీ అది సాధ్యం కాదు.
ఆ స్థితిని చేరుకోవడానికి పూజ గదులు, దేవాలయాల ఆవశ్యకత ఉంది.
దీన్ని గౌణి పూజ అంటారు. శ్రీ రామ కృష్ణ పరమ హంస, స్వామి వివేకానంద, పవహారి బాబా, శ్రీ రమణ మహర్షి ఇలా అసంఖ్యాకులైన మహాత్ములు సర్వేశ్వరుని సర్వాంతర్యామిత్వాన్ని దర్శించాలంటే దైవాను గ్రహం ఉంటే మీరు చూడగలరు.
కానీ అందుకోసం చాలా కష్టపడాల్సి ఉంటుంది.అంటే దేవుడి మీద నమ్మకంతో పాటుగా అనేక విషయాలను గూర్చి తెలిసి ఉండాలి.
ఆ భగవతుండి గురించి పూర్తిగా తెలుసుకోవాలి.అప్పడే మనం ఏం చేయాలనుకున్నా చేయగలం.
ముఖ్యంగా ఆ దేవుడు అన్ని చోట్లా ఉన్నాడని.పూర్తిగా విశ్వసించగలం.