కామధేనువు.కామ ధేనువు ఒక గోవు.దీనిని ‘సురభి‘ అని కూడా అంటారు.దేవతలు, రాక్షసులు క్షీర సాగర మథనం చిలికే సమయంలో ఎనిమిదో సారికి ఇది పుట్టింది.ఇది కోరిన కోర్కెలు అన్నింటినీ ప్రసాదిస్తుంది.దీని పొదుగు నుండి అమృతం స్రవిస్తుంది.
కల్ప వృక్షము.కల్ప వృక్షం కూడా కోరిన వారి కోర్కెలను తీరుస్తుంది.
ఇది గూడ కామధేనువు వలె క్షీరసాగర మథన కాలంలో పుట్టింది.ఈ దేవతా వృక్షం ఇంద్రుని ఉద్యానం నుండి సమస్త ఋతువులలోనూ పత్ర పుష్పాలతో నిత్యం శోభితమై ఉంటుంది.
అంతే కాదండోయ్ జీవిత వృక్షం అయిన కల్ప వృక్షానికి “ప్రపంచ చెట్టు” అని అర్ధం వస్తుందని చతుర్వేదాల్లో ప్రస్తావించబడింది. క్షీర సాగర మథనం యొక్క ప్రారంభ వృత్తాంతంలో, కల్పవృక్ష సముద్రపు మధన ప్రక్రియలో ప్రాథమిక జలాల నుండి ఉద్భవించింది, అన్ని అవసరాలను అందించే దైవిక ఆవు అయిన కామధేనుతో పాటు, ఈ చెట్టు పాలపుంత లేదా సిరియస్ నక్షత్రం నక్షత్రాల జన్మస్థలం అని కూడా అంటారు.
అలాగే చింతామణి… చింతామణి ఒక దేవమణి.ఇది గూడ చింతించిన అనగా కోరిన కోర్కెలను తీర్చే శక్తి కల్గి ఉన్నది.
చింతామణి మంత్రమును ఉపాసించిన వారికి సంకల్పిత అర్థాలు సిద్ధిస్తాయి.కామధేను – కల్పవృక్ష – చింతామణులకు సంబంధించిన సిద్ధులను పేర్కొంటూ తత్త్వవేత్తలు నిష్కామ స్థితియే కామధేను సిద్ధియనీ, నిస్సంకల్ప స్థితియే కల్ప వృక్ష సిద్ధియనీ, నిశ్చింతా స్థితియే చింతామణి సిద్ధియనీ వివరించారు.
జిజ్ఞాసువులు దీనిని గ్రహించగలరు.