ప్రపంచంలో చాలా వింతలు, విచిత్రాలు జరుగుతూ ఉంటాయి.సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూ ఉంటాయి.
ఇప్పుడు అలాంటి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఓ రెస్టారెంట్ 46 ఏళ్లుగా నీటిలోనే ఉంది.
నీటిలోనే తేలియాడుతూ ఉంది.అయితే నష్టాల వల్ల ఆ హోటల్ ను మూసివేసే దిశగా నిర్వాహకులు చర్యలు చేపట్టారు.
దీంతో హోటల్ కి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ రెస్టారెంట్ హాంకాంగ్ లో ఉంది.1976లో ఈ రెస్టారెంట్ ను నిర్మించారు.ఎంతోమంది ప్రముఖులకు ఇది ఆతిధ్యం ఇచ్చింది.
కరోనా వల్ల లాక్ డౌన్ ఎఫెక్ట్ తో ఈ రెస్టారెంట్ నష్టాలబాట పట్టింది.దీంతో రెస్టారెంట్ నిర్వహణకు డబ్బులు లేకుండా పోయాయి.
క్వీన్ ఎలిజబెత్, హాలీవుడ్ సూపర్ స్టార్ టామ్ క్రేజ్ వంటి సెలబ్రెటీలు గతంలో ఈ రెస్టారెంట్ కు వచ్చి బస చేసేవారు.
ఈ రెస్టారెంట్ ను కాపాడటానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో మూసివేసే దిశగా నిర్వాహకులు ఉన్నారు.
ఈ రెస్టారెంట్ ను మూసివేయకుండా ఆర్థిక సహాయం చేయాలి చట్టసభ సభ్యులు ప్రభుత్వానికి నివేదికలు పంపారు.అయితే ఆర్ధిక సాయం అందకపోవడంతో మూసివేసే దిశగా అడుగులు వేస్తున్నారు.
కోవిడ్ సమయంలో లాక్ డౌన్ వల్ల ఈ రెస్టారెంట్ ను మూసివేయగా.ఆ తర్వాత తెరచుకోలేదు.
ఈ రెస్టారెంట్ నిర్వహణ కోసం కోట్ల రూపాయాల ఖర్చు అవుతోంది.వాటిని భరించడం నిర్వాహకులకు భారంగా మారింది.దానిని తిరిగి ఓపెన్ చేయడానికి పెట్టుబడిదారులు కూడా ఎవరూ ముందుకు రాలేదు.దీంతో హంకాంగ్ లోని అబెర్డీన్ నౌకాశ్రయం నుంచి హోటల్ ను తొలగించారు.