మెగా స్టార్ చిరంజీవి ఆచార్య సినిమా విడుదల అయిన వెంటనే సురేఖ గారి తో విదేశాలకు వెళ్లిన విషయం తెల్సిందే.సమ్మర్ వెకేషన్ ను చిరంజీవి దంపతులు విదేశాల్లో గడిపేందుకు వెళ్లారు అనేది మెగా కాంపౌండ్ నుండి వినిపిస్తున్న మాట.
అయితే కొందరు మాత్రం చిరంజీవి తన ఫిజిక్ విషయంలో మరింతగా మెరుగులు దిద్దుకోవడం కోసం విదేశాలకు వెళ్లాడు అనేది కొందరి టాక్.మొత్తానికి మెగా స్టార్ చిరంజీవి విదేశీ పర్యటన చుట్టు ఎవరికి తోచిన విధంగా వారు ఊహలు అల్లేసుకున్నారు.
ఎవరికి తోచిన విధంగా వారు మాట్లాడేసుకుంటున్నారు.అసలు విషయం ఏంటీ అనేది ఆ మెగా కాంపౌండ్ కు మాత్రమే తెలియాలి.
చిరంజీవి ఇండియాకు వచ్చాడా లేదా అనే విషయంలో క్లారిటీ లేదు.
చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా షూటింగ్ ను ముగించాల్సి ఉంది.
మరో వైపు భోళా శంకర్ సినిమా కూడా పెండ్డింగ్ ఉంది.ఈ రెండు కాకుండా బాబీ దర్శకత్వంలో వాల్తేరు వీరన్న సినిమాను కూడా చిరంజీవి చేస్తున్నాడు.
వీటితో పాటు మరో రెండు మూడు సినిమాలను కూడా చిరంజీవి కమిట్ అయ్యాడు.ఇంతటి బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా చిరంజీవి విదేశీ పర్యటనకు వెళ్లడం విడ్డూరంగా ఉందంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
చిరంజీవి రాక కోసం ఫిల్మ్ మేకర్స్ మరియు అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.వారు మాత్రమే కాకుండా ఆచార్య ఫిల్మ్ వల్ల నష్టపోయిన బయ్యర్లు కూడా ఆయన్ను కలవాలని ప్రయత్నాలు చేస్తున్నారట.
మొత్తానికి చిరంజీవి మీడియా ముందుకు రాక చాలా కాలం అవ్వడం వల్ల అందరు కూడా ఆసక్తిగా ఆయన గురించిన సమాచారం కోసం ఎదురు చూస్తున్నారు.బాస్ ఎక్కడున్నాడు.
ఏం చేస్తున్నాడు అనే విషయాలపై క్లారిటీ రావాలంటే మరికొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే.