కిర‌ణ్ కుమార్ రెడ్డికి కాంగ్రెస్ సౌత్ బాధ్య‌త‌లు..? పార్టీ బ‌లోపేతం చేసే ఆలోచ‌న‌లో నాయ‌క‌త్వం

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ చివ‌రి ముఖ్య‌మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గురించి అంద‌రికీ తెలిసిందే.ముక్కుసూటిగా మాట్లాడ‌టం.

 Congress South Responsibilities For Kiran Kumar Reddy Details,congress,kiran Kum-TeluguStop.com

క్లిష్ట ప‌రిస్థితుల్లో క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకునే ధ్యైర్యం ఉన్న‌వాడు.భార‌త జాతీయ కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున ఉమ్మ‌డి ఏపీ శాస‌న స‌భ‌కు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక‌య్యారు.

ఈయ‌న 1960 సెప్టెంబరు 13న నల్లారి సరోజమ్మ, అమరనాథరెడ్డిలకు హైదరాబాద్ లో జన్మించాడు.వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి అయాంలో 2004 నుంచి 2009 మ‌ధ్య శాస‌న స‌భ‌లో ప్ర‌భుత్వ చీఫ్ విప్‌గా ప‌నిచేశారు.

ప్ర‌త్యేక తెలంగాణ ఉద్య‌మ కాలంలో ప‌లువురు ఎమ్మెల్యేలు రాజీనామా చేసినపుడు చీఫ్ విప్‌గా అత్యంత నేర్పుగా వ్య‌వ‌హ‌రించారు.మే 2009 నుంచి న‌వంబ‌ర్ 2010 మ‌ధ్య దాదాపు ఏడాదిన్న‌ర పాటు 13 వ ఆంధ్ర‌ప్ర‌దేశ్ శాస‌న‌స‌భ‌కు స్పీక‌ర్‌గా ఏక‌గ్రీవంగా ఎన్నికై ప‌ని చేశారు.

కాగా కిర‌ణ్ కుమార్ రెడ్డి నిజాం కాలేజ్ లో చ‌దివే రోజుల్లో స్టూడెంట్ సంఘానికి అధ్య‌క్ష‌త వ‌హించాడు.అలాగే కిర‌ణ్ కుమార్ కు క్రికెట్ అంటే ఎంతో ఇష్టం.

కాగా హైద‌రాబాద్ రంజీ జ‌ట్టు, ఇండియా అండ‌ర్‌-22, సౌత్‌జోన్ యూనివ‌ర్సిటీస్ మ‌రియు ఉస్మానియా యూనివ‌ర్సిటీ క్రికెట్ జ‌ట్ల‌కు కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించారు.

కాగా కిర‌ణ్ కుమార్ రెడ్డి రాజ‌కీయ జీవితంలో ఎలాంటి వివాదాలకు తావులేదు.

Telugu Ap Congress, Ap, Ap Pcc, Congress-Political

ఎలాంటి అవినీతి ఆరోపణలు లేని వ్యక్తిగా.ముక్కుసూటిగా వ్య‌వ‌హ‌రించే తీరు.కీలక సందర్భాల్లో కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు సైతం వెనుకంజ వేయని మనస్తత్వమే ఆయనను ముఖ్య‌మంత్రి స్థాయికి ఎదిగేలా చేసింది.2004లో ప్రభుత్వ చీఫ్ విప్‌గా ఎన్నికై వైఎస్ఆర్‌కు అత్యంత స‌న్నిహితంగా మెలిగారు.అయితే ప్ర‌త్యేక తెలంగాణ ఏర్ప‌డిన త‌ర్వాత కిర‌ణ్ కుమార్ రెడ్డి రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్నారు.కాగా ప్ర‌స్తుతం ఈయ‌నకు కాంగ్రెస్ అధిష్టానం ఢిల్లీకి రావాల‌ని పిలుపు వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది.

ఏపీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ తో పాటు సౌత్ లో కాంగ్రెస్ ను బ‌లోపేతం చేయాల‌ని బాధ్య‌తలు అప్ప‌గించ‌నున్న‌ట్లు స‌మాచారం.ఇప్ప‌టికే కిర‌ణ్ కుమార్ త‌న స‌న్నిహితుల‌తో చేరికపై చ‌ర్చ‌లు జ‌రిపిన‌ట్లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube