ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 05.54
సూర్యాస్తమయం: సాయంత్రం 06.32
రాహుకాలం: మ.3.00 ల4.30
అమృత ఘడియలు:ఉ.6.00ల8.00,సా.4.40ల6.30
దుర్ముహూర్తం:ఉ.8.32ల9.23,ప.11.15ల12.00
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:
ఈరోజు మీకు అనుకున్న విధంగా గడుస్తుంది.అన్ని పనులు పూర్తి చేస్తారు.కొందరు బంధువులు వచ్చే అవకాశం ఉంది.
ఆరోగ్యం కుదుట పడుతుంది.ఆర్థిక పరంగా ఎక్కువ ఖర్చులు చేయకూడదు.
దూర ప్రయాణాలు చేస్తారు.ఉద్యోగస్తులకు కాస్త శ్రమ ఎక్కువగా ఉంటుంది.
వృషభం:
ఈరోజు మీకు మీరు పనిచేసే నుండి మంచి ఫలితాలు అందుతాయి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.ఇతరులు మీ సొమ్మును తిరిగి ఇస్తారు.విద్యార్థులు బాగా కష్ట పడాల్సి ఉంటుంది.వ్యక్తిగత జీవితంలో అనుకున్నవన్నీ జరుగుతాయి.సమయాన్ని కాలక్షేపం చేస్తారు.
మిథునం:
ఈరోజు మీరు కొన్ని అప్పుల సమస్య నుండి బయట పడతారు.అనుకున్న పనులు పూర్తి చేస్తారు.కుటుంబ సభ్యులతో కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు.విద్యార్థులు చదువు పట్ల బాగా శ్రద్ధ పెట్టాలి.ఆరోగ్యం ఈరోజు కుదుటపడుతుంది.వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి.
కర్కాటకం:
ఈరోజు మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.కొందరి ఉద్యోగస్తులకు బదిలీ అయ్యే అవకాశం ఉంది.ఆర్థికంగా పరవాలేదు.సమాజంలో మంచి పేరు సంపాదించుకుంటారు.మీ పాత స్నేహితులతో కలిసి కొన్ని తీర్థయాత్ర ప్రయాణాలు చేస్తారు.
సింహం:
ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.అనవసరంగా వాదనలకు దిగకండి.పిల్లల నుండి శుభవార్త వింటారు.
వివాహం కాని వారికి వివాహ సంబంధాలు కుదురుతాయి.కొన్ని సమస్యలను ఎదుర్కొనే శక్తి మీలో ఉంది.
కన్య:
ఈరోజు మీరు చేయాల్సిన కొన్ని ముఖ్యమైన పనులు అనుకున్న సమయానికంటే ముందుగానే పూర్తి చేస్తారు.విదేశ బంధువుల నుండి శుభవార్త వింటారు.అనవసరమైన విషయాలను పట్టించుకోకండి.ఇతరులకు సహాయం చేస్తారు.ఉద్యోగస్తులకు లాభాలున్నాయి.
తులా:
ఈరోజు మీరు తీరిక లేని సమయం గడుపుతారు.ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.ఇతరులతో మాట్లాడే ముందు కాస్త ఆలోచించాలి.
కొన్ని ప్రయాణాలు మీకు అనుకూలంగా ఉంటాయి.కొన్ని ముఖ్యమైన విషయాలలో సొంత నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది.
వృశ్చికం:
ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేసుకోవడానికి సమయాన్ని కేటాయించాలి.శత్రువుల కు దూరంగా ఉండాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.దూరప్రయాణాలు మీకు అనుకూలంగా ఉంటాయి.పాత స్నేహితులను కలుస్తారు.
ధనస్సు:
ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.విలువైన వస్తువులు కొనుగోలు చేసే ముందు జాగ్రత్తగా ఉండాలి.అనుకోకుండా శుభవార్త వింటారు.
ఇతరులతో మాట్లాడే ముందు బాగా ఆలోచించాలి.నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.
మకరం:
ఈరోజు మీరు అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.ఆరోగ్యం కూడా అంతగా సహకరించదు.ఇతరుల సహాయం పొందాల్సి ఉంటుంది.కుటుంబ సభ్యులతో కొన్ని విషయాల గురించి పంచుకుంటారు.దూర ప్రయాణాలు చేయకూడదు.
కుంభం:
ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు.దీనివల్ల ఎటువంటి చింత చెందాల్సిన పని లేదు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.
మీ కుటుంబ సభ్యులతో కొన్ని తీర్థయాత్ర ప్రయాణాలు చేస్తారు.కొన్ని పరిచయాలు మీ వ్యక్తిగత జీవితం లోకి వస్తాయి.
మీనం:
ఈరోజు మీరు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.మీ స్నేహితులతో కలిసి సమయాన్ని కాలక్షేపం చేస్తారు.ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు చేస్తారు.తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.కొన్ని విలువైన బహుమతులు పొందే అవకాశం ఉంది.