సకాలంలో డబ్బులు జమ అయ్యేలా చర్యలు:కలెక్టర్

యాదాద్రి జిల్లా:భువనగిరి రూరల్ మండలం చందుపట్ల ప్యాక్స్ పరిధిలోని చందుపట్ల,వీరవెల్లి గ్రామాల ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పరిశీలించారు.తూనిక యంత్రాలు, తేమ కొలిచే యంత్రాలు,ప్యాడీ క్లీనింగ్ యంత్రాలు, ఫ్యాన్లు,గన్నీ బ్యాగులు సిద్ధం చేసుకొని రేపటి నుండి కొనుగోళ్లు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.

 Measures To Deposit Money In A Timely Manner: Collector-TeluguStop.com

వేసవి దృష్ట్యా కొనుగోలు కేంద్రాలలో మంచి నీటి వసతి,టెంట్ సౌకర్యం కల్పించాలని, రైతుల నుండి వేగంగా కొనుగోళ్లు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.రైతుల నుండి కొనుగోళ్ల అనంతరం ట్యాబ్ ఎంట్రీ పూర్తి చేసి రైతుల ఖాతాలలో నగదు సకాలంలో జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

కార్యక్రమంలో జిల్లా సహకార అధికారి శ్రీమతి పరిమళ,అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఈశ్వర్,ప్యాక్స్ సిఇఓ రాములు,తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube