టాలీవుడ్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ను తాజాగా పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.ఆదివారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో హైదరాబాద్ ర్యాడిసన్ బ్లూ హోటల్ లోని ఫుడ్ అండ్ మిల్క్ పబ్ పై టాస్క్ ఫోర్స్ పోలీసులు రైడ్ చేశారు.
అక్కడ డ్రగ్స్ వ్యవహారం వెలుగులోకి రావడంతో పోలీసులు 150 మందిని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.ఈ 150 మందిలో ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు కూడా ఉన్నారు.
దీంతో ఈ విషయం కాస్త హాట్ టాపిక్ గా మారింది.రాహుల్ తోపాటు నిహారిక ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ జరిపి అనంతరం పంపించేశారు.
ఇదే విషయం పై సోషల్ మీడియాలో పలు రకాల వార్తలు వినిపిస్తున్నాయి.ఈ క్రమంలో నిహారిక గురించి ఈ సోషల్ మీడియాలో పలు రకాల రూమర్స్ వినిపిస్తుండడంతో నిహారిక తండ్రి మెగా హీరో నాగబాబు స్పందిస్తూ ఒక వీడియోను కూడా విడుదల చేశాడు.
ఇదిలా ఉంటే తాజాగా బిగ్ బాస్ విన్నర్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కూడా ఈ విషయం ఫై స్పందిస్తూ ఒక వీడియో ని విడుదల చేశాడు.ఆ వీడియోలో రాహుల్ మాట్లాడుతూ నేను ఫ్రెండ్ బర్త్ డే పార్టీ ఉంటే అక్కడికి విషెస్ చెప్దాం అని వెళ్లాను.
మామూలుగా రాత్రి ఒంటిగంట వరకు పంపు ఉంటుంది.ఆ లోపు వచ్చేద్దామని అక్కడికి వెళ్లాను.
కానీ అక్కడ చాలామంది ఉన్నారు.డ్రగ్స్ కేసు అన్నప్పుడు హోటల్ యజమానిని లేదా మేనేజర్ ని డ్రగ్స్ తీసుకున్న వారిని పట్టుకోవాలి.ఒకవేళ నేను డ్రెస్సు తీసుకుని ఉంటే నేను ఇంట్లో ఎందుకు కూర్చుంటాను.కావాలి అంటే మీరు ఏ టెస్ట్ అయినా చేసుకోవచ్చు.నేను ఎప్పుడో ఒకసారి ఇలాంటి పార్టీలకు వెళ్తూ ఉంటాను.అలా వెళ్లిన క్రమంలోనే ఇలా జరిగింది అని చెప్పుకొచ్చాడు రాహుల్.
అలాగే నిన్న మొన్న వరకు నేను కూడా డ్రగ్స్ అవేర్నెస్ ప్రోగ్రాం లో తిరిగాను.అడ్రస్ అన్నవి ఎలా ఉంటాయో కూడా నాకు తెలియదు.
ఆ పబ్ లో దాదాపుగా 150 నుంచి 200 మంది ఉన్నారు.నేను ఆ పబ్బు కి నా బ్రదర్ తో కలిసి వెళ్ళాను.
అక్కడ ఎవరు డ్రగ్స్ విసిరారో నాకు తెలియదు నా ఫ్రెండ్స్ కుటుంబ సభ్యులు ఫోన్ చేస్తున్నారు, మా తల్లిదండ్రులు టెన్షన్ పడుతున్నారు.ఇక నుంచి బయటకు రావడానికి నలభై నిమిషాల సమయం పడుతుంది ఆ సమయంలోనే టాస్క్ ఫోర్స్ వాళ్ళు వచ్చి అదుపులోకి తీసుకున్నారు అని అసలు విషయాన్ని బయట పెట్టేసాడు రాహుల్.