సంగీత దర్శకుడు చక్రవర్తి.. జీవితంలో ఇన్ని మలుపులా?

అలనాటి సంగీత దర్శకుడు చక్రవర్తి కి చిత్ర పరిశ్రమలో ఎంత గుర్తింపు ఉంది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఆయన అందించిన పాటలు ఇప్పటికి ఎంతోమంది శ్రోతలను అలరిస్తూ వుంటాయి.

 Music Director Chakravarthi And His Career Up And Downs , Music Director , Chakr-TeluguStop.com

ఇక ఎన్నో పాటలు ఇప్పటికీ ఎవర్గ్రీన్ గానే ఉండి పోయాయి.మధురమైన సంగీతాన్ని కేరాఫ్ అడ్రస్గా అర్థవంతమైన పాత్రలకు చిరునామాగా సంగీత దర్శకుడు చక్రవర్తి తన ప్రస్థానాన్ని కొనసాగించారు.

ఇక అలాంటి గొప్ప దర్శకుడైన చక్రవర్తి జీవిత విశేషాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Allindia Radio, Basavayya, Career Downs, Chakravarthi, Madras, Music, Roh

మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి అసలు పేరు కొమ్మినేని అప్పారావు.తండ్రిగారు గుంటూరులో ఉన్న వెంకటప్పయ్య శాస్త్రి దగ్గర ఆయనకు సంగీతం నేర్పించారు.ఇలా సంగీతం నేర్చుకున్న కొమ్మినేని అప్పారావు ఇక ఆ తరువాత కాలంలో అదే ఫీల్డులో కొనసాగుతూ వినోద్ ఆర్కెస్ట్రా కూడా ఏర్పాటు చేశారు.

పాటలు పాడటమే కాదు పద్యాలు కూడా పాడుతూ గ్రామ గ్రామాలలో తిరుగుతూ ప్రదర్శనలిస్తూ ఇక చుట్టుపక్కల అన్ని ప్రాంతాల్లో కూడా బాగా గుర్తింపు సంపాదించారు.కానీ ఎందుకో అప్పారావు అలా చేయడం తండ్రి బసవయ్య కు అస్సలు నచ్చలేదు.

బాగా చదివించింది ఇందుకేనా అంటూ మందలించడమే కాదు ఇక కొడుకును చూసి బాధ పడుతూ ఉండేవాడు.

Telugu Allindia Radio, Basavayya, Career Downs, Chakravarthi, Madras, Music, Roh

ఇక తండ్రి బాధను అర్థం చేసుకున్న అప్పారావు ఆలిండియా రేడియో లో జాయిన్ అయ్యారు.ఇక అప్పట్లో ఆల్ ఇండియా రేడియో కి అప్పారావు కంఠం తోనే బాగా గుర్తింపు వచ్చింది.ఇక దీంతో అప్పారావు అందరికీ సుపరిచితుడు గా మారిపోయాడు.

కానీ అక్కడితో ఆగిపోకూడదు అనుకొని ఇక తాను సినిమాల్లోకి వెళ్లాలని ఏదో సాధించాలి అనుకుంటున్నా అన్న విషయాన్ని మామ కూతురు రోహిణితో చెప్పాడు.అప్పుడే సినిమాల్లోకి వెళ్లి బావ అంటూ ఆమె ప్రోత్సహించింది.

దీంతో ఇక ఆనందం పట్టలేక ఆమె మెడలో తాళి కట్టి మద్రాసు తీసుకెళ్లాడు.ఇక ఎన్నో ఏళ్ల పాటు గ్రామఫోన్ లో పాడటం లాంటివి చేస్తూ పలు అవకాశాల కోసం తిరిగిన అప్పారావుకు ఇక విఠలాచార్య విజయ విజయలో పాడే అవకాశం ఇచ్చారు ఇక ఆ తర్వాత ఫాలోమా అనే మలయాళ చిత్రం హిందీ డబ్బింగ్ కి అప్పారావు సంగీత దర్శకుడిగా మారిపోయాడు.

అయితే ఈ సినిమాలో టైటిల్స్ అన్ని హిందీ లో ఉండడంతో అప్పారావు అనే తెలుగు పేరు ఎందుకు అని ఆయన పేరును చక్రవర్తి గా మార్చారు.అప్పటి నుంచి సంగీత దర్శకుడు చక్రవర్తి గా ఆయన వెనక్కి తిరిగిచూసుకోలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube