తెలంగాణ కాంగ్రెస్ లో జరుగుతున్న పరిణామాలతో ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ లో జరుగుతున్న పరిణామాలపైనే చర్చ జరుగుతున్న పరిస్థితి ఉంది.అయితే రేవంత్ నాయకత్వంపై మొదటి నుండి కాంగ్రెస్ సీనియర్లు కాస్త అసంతృప్తిగా ఉన్నారన్న మాట వాస్తవమే అయినా ఇప్పుడు వచ్చినంతగా అప్పుడు అంతగా అంతర్గత విషయాలనేవి బయటకు రాలేదు.
కానీ రాను రాను రేవంత్ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాల విషయంలో సీనియర్ లను పరిగణలోకి తీసుకోకపోవటంతో ఇక కాంగ్రెస్ సీనియర్ లకు, రేవంత్ కు మధ్య గ్యాప్ పెరిగిందని చెప్పవచ్చు.
ఇందులో భాగంగానే రేవంత్ నాయకత్వంపై, నిర్ణయాలపై బహిరంగ వ్యాఖ్యలు చేస్తుండటం, రేవంత్ కు వ్యతిరేకంగా సమావేశం నిర్వహించటంతో అధిష్టానం వెంటనే దిద్దుబాటు చర్యలు తీసుకునే ప్రయత్నం చేసింది.
కానీ ఆ నిర్ణయం రేవంత్ కు అనుకూలంగా ఉండటంతో కాంగ్రెస్ సీనియర్లు అధిష్టానం తమ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోకపోవటం పట్ల అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తోంది.అయితే ఈ విషయాన్ని బహిరంగంగా చెప్పకున్నా అంతర్గత సమావేశాల్లో మాత్రం ఇదే విషయం ప్రముఖంగా ప్రస్తావనకు వస్తున్న పరిస్థితి ఉంది.
అయితే ఏది ఏమైనా సోనియాగాంధీని కలిసి తమ సమస్యలను ఆమె దృష్టికి తీసుకెళ్ళే ప్రయత్నాలను మాత్రం కొనసాగిస్తూనే తమకు కూడా ప్రాధాన్యత నివ్వాలని కోరుతున్న పరిస్థితి ఉంది.

అయితే అధిష్టానం కాంగ్రెస్ సీనియర్ ల సమస్యలను పరిగణలోకి తీసుకుంటే రేవంత్ కు కొంత ఎదురుదెబ్బ అని చెప్పవచ్చు.ఎందుకంటే ఇప్పుడు తీసుకుంటున్నంత వేగంగా స్వంత నిర్ణయాలను తీసుకోలేక పోవడమే కాకుండా తప్పని సరిగా సీనియర్ ల అభిప్రాయాలను కూడా తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది.మరి కాంగ్రెస్ సీనియర్ లు సోనియా గాంధీతో భేటీ తరువాత మాత్రమే ఒక స్పష్టమైన క్లారిటీ వచ్చే అవకాశం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.







