శివలింగానికి, నందీశ్వరుడికి మధ్య మనం నడవకూడదా.. ?

మన హిందూ సంప్రదాయాల ప్రకారం మనకు మక్కోటి దేవతలు ఉన్నారు.  అందులో ఒక్కో దేవుడి గుడికి వెళ్లినప్పుడు ఒక్కోలా నడుచు కుంటాం.

అంటే ఒక్కో దేవుడికి ఇష్ట మైనట్లుగా అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు చేస్తుంటాం.అయితే శివాలయానికి వెళ్లినప్పుడు మాత్రం మరికొంత జాగ్రత్తగా ఉంటాం.

అందుకు కారణం.శివాలయంలో ఉండే శివ లింగానికి, నందీశ్వరుడికి మధ్య మనుషులు నడవ కూడదు అని చెప్తుంటారు.

అందుకే మనం చాలా జాగ్రత్తగా నడుచు కుంటాం .అయితే అసలు నిజంగానే అలా నడకూడదా నడిస్తే ఏమవుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.ఏజయర్ద్వియోర్మధ్యే నంది శంకర యోరపి అనే ప్రమాణాన్ని బట్టి మేక పోతుల నడుమ, ద్విజుల నడుమ, నంది శంకరుల నడుమ నడవ రాదని మన పెద్దలు చెబుతుంటారు.

Advertisement

శివుడు భక్తాను గ్రహతత్పరుడు.నంది శివ భక్తుల్లో అగ్రగణ్యుడు.శివునికి వాహనమైన నందీశ్వరుడు.

ఈ భోళా శంకరుడి పాద పద్మాలను ఎడతెగ కుండా నందీశ్వరుడు దర్శిస్తుంటాడు.శంకరుడు గూడా అవిశ్ఛినంగా భక్తాగ్ర గణ్యుడైన నందీశ్వరుని అనుగ్రహ దృష్టిని ప్రసరింప జేస్తుంటాడు.

వీరిరువురి మధ్య మానవులు నడిస్తే వారి పరస్పర దృష్టి ప్రసారానికి విచ్ఛేదం ఏర్పడు తుంది.అందువల్ల ఇరువురికీ అడ్డు తగిలిన వారిపై కోపం రావచ్చు.

అందుకే శివ లింగానికి, నందీశ్వరుల  మధ్య నడవ రాదని చెప్తుంటారు.ఇక నుంచి మీరు ఎప్పుడైనా శివాలయానికి వెళ్తే.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
These Face Packs Help To Get Smooth Skin Details Face Packs

నందీశ్వరుడికి శివ లింగానికి మధ్యలో అస్సలే నడవకండి.నందీ శ్వరుడి కొమ్ముల మధ్యలో నుంచి శివ లింగాన్ని చూస్తే మరింత మంచిది.

Advertisement

తాజా వార్తలు