తెలంగాణ రాజకీయం కొత్త మలుపులు తిరుగుతూ సరికొత్త రంగు పులుము కుంటోంది.ఇక ఇప్పుడిప్పుడే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బలపడటానికి పెద్ద ఎత్తున ప్రయత్నిస్తున్న క్రమంలో ఇక కెసీఆర్ కు వ్యతిరేకంగా అన్ని పార్టీలు ఒక్కటవుతున్న విచిత్ర రాజకీయ పరిస్థితిని మనం ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో చూస్తూ ఉన్నాం.
ఇక బీజేపీ, కాంగ్రెస్ జాతీయ పార్టీలే కాక బీఎస్పీ, వైయస్సార్ టీపీ లాంటి పార్టీలు కూడా కెసీఆర్ టార్గెట్ గా పెద్ద ఎత్తున ఘాటు విమర్శలు చేస్తూ ముందుకు సాగుతున్న పరిస్థితి ఉంది.ఇక అరవింద్ కేజ్రీవాల్ అధ్యక్షుడిగా ఉన్న ఆప్ పార్టీ కూడా తెలంగాణలో కీలకమైన పార్టీగా మారడానికి పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.
అయితే ఏప్రిల్ 14 నుండి తెలంగాణలో పాదయాత్ర కూడా చేపట్టనున్నారనే వార్తలు కూడా రాజకీయ వర్గాలలో పెద్ద ఎత్తున చక్కర్లు కొడుతున్న పరిస్థితి ఉంది.
అయితే తెలంగాణలో ఒక శాతం మించి ప్రజలకు ఆప్ పార్టీ అంటే తెలియదు.
ఇటువంటి పరిస్థితుల్లో ఆప్ పార్టీ ఏ మేరకు సత్తా చాటుతుంది అనేది ఇప్పుడే మనం స్పష్టంగా చెప్పలేకపోయినా ఎంతో కొంత రాజకీయ పునాదికి మాత్రం అవకాశం ఏర్పడుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.అయితే రానున్న రోజుల్లో ఆప్ తెలంగాణలో ఎంతో కొంత కీలకమైన పార్టీగా ఎదిగే అవకాశాలు ఉన్నాయి.
ఎందుకంటే సాంప్రదాయ రాజకీయ విధానానికి విరుద్దంగా ఆప్ పార్టీ పరిపాలన సిద్దాంతాలు ఉంటాయి కాబట్టి ఎంతో కొంత నేటి యువత ఆప్ సిద్దాంతాలకు ఆకర్షితులైనా ఆప్ తెలంగాణలో బలపడటానికి కొంత మేర అవకాశాలు ఏర్పడుతాయి.అయితే కొత్త కొత్త పార్టీల ఎంట్రీపై ఇంకా కెసీఆర్ స్పందించకపోయినా సరైన సమయం లో స్పందించేందుకు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు.