విశ్వక్ సేన్ హీరోగా రుక్సర్ ధిల్లాన్ హీరోయిన్ గా వస్తున్న సినిమా అశోకవనంలో అర్జున కళ్యాణం.ఈ సినిమాను విద్యా సాగర్ చింతా డైరెక్ట్ చేస్తున్నారు.
మ్యారేజ్ కాన్సెప్ట్ తో ఎంటర్టైనింగ్ మూవీగా రాబోతున్న ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను మెప్పించింది.ఇక లేటెస్ట్ గా ఈ సినిమా రిలీజ్ డేట్ లాక్ చేశారు చిత్రయూనిట్.
ఏప్రిల్ 22న విశ్వక్ సేన్ సినిమా అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా రిలీజ్ చేశారు.
ఏప్రిల్ నెలలో పెద్ద సినిమాలన్ని వరుసగా రిలీజ్ అవుతున్నాయి.
ఏప్రిల్ 22న కె.జి.ఎఫ్ చాప్టర్ 2 కూడా రిలీజ్ ప్లాన్ చేశారు.అంతేకాదు విజయ్ బీస్ట్ కూడా ఆ డేట్ నే రిలీజ్ ఎనౌన్స్ చేశారు.
ఈ భారీ సినిమాల మధ్యలో విశ్వక్ సేన్ సినిమా ఏమేరకు ప్రభావితం చూపిస్తుందో చూడాలి.ఈ సినిమాలో విశ్వక్ సేన్, రుక్సర్ థిల్లాన్ ల జోడీ ఆడియెన్స్ ని ఆకట్టుకునేలా ఉందని చెప్పొచ్చు.
ఓ పక్క మాస్ మసాలా సినిమాలు చేస్తూ మరో పక్క సాఫ్ట్ అండ్ ఎంటర్టైనింగ్ కథలకు ఓకే చెబుతూ విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకోవాలని చూస్తున్నాడు విశ్వక్ సేన్.పాగల్ తో పర్వాలేదు అనిపించుకున్న విశ్వక్ సేన్ ఈ సినిమాతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.