ప్రపంచంలో అత్యధిక కాలం జీవించే జీవి ఇదే.. ఎక్కడుంటుందంటే..

ఎక్క‌డైనా మానవుడు లేదా జంతువు యొక్క గరిష్ట వయస్సు ఎంత? అంటే చాలామంది 100, 150 లేదా 200 సంవత్సరాలు అని సమాధానం ఇస్తారు.ఇందులో ఏనుగు లేదా తాబేళ్ల‌ను ప్ర‌స్తావిస్తారు.

 This Is The Longest Living Creature In The World,  Living  , World , Turtle , He-TeluguStop.com

మ‌నుషులు 100 లేదా అంతకంటే తక్కువ సంవత్సరాలు మాత్రమే జీవిస్తారని చెబుతారు.అయితే ఇప్ప‌టివ‌ర‌కూ చాలాకాలంగా సజీవంగా ఉంటున్న‌ జీవి భూమిపై ఉందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.

ప్రపంచంలోనే ఎక్కువ కాలం జీవించినదిగా దీని పేరు రికార్డులకెక్కింది.ప్రపంచంలోనే ఎక్కువ కాలం జీవించే జంతువు తాబేలు అని మ‌రోసారి గుర్తుచేసుకుందాం.

దీని సగటు వయస్సు 150 నుండి 200 సంవత్సరాలు.అయితే ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన ఒక తాబేలు ఇంతకంటే ఎక్కువ కాలం జీవించిందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.

దాని వయస్సు చాలా ఎక్కువగా ఉంది.

దాని వయస్సు గురించి శాస్త్రవేత్తలు కూడా గందరగోళానికి గురవుతుంటారు.

ఇప్పుడు జోనాథన్ అనే తాబేలు గురించి తెలుసుకుందాం.ఇది భూమిపై ఎక్కువ కాలం జీవించిన‌ జంతువుగా చెబుతున్నారు.

ఇది ప్రపంచంలోనే అత్యంత పురాతన జీవి అనే ఘ‌న‌త‌ పొందింది.ఈ తాబేలు దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రంలోని సెయింట్ హెలెనా ద్వీపంలో కనిపిస్తుంది.

ఇది దాని వయస్సు కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది.ప‌లు నివేదికల ప్రకారం జోనాథన్ అనే ఈ తాబేలు 1832లో జన్మించింది.అంటే ఇప్పుడు దాని వయసు 190 ఏళ్లు దాటింది.1882లో, జోనాథన్‌కు 50 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు, అతన్ని సెయింట్ హెలెనాకు తీసుకువచ్చారు.

Telugu Atlantic Ocean, Helen Island, Jonathan, Turtle-Latest News - Telugu

జోనాథన్ పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో అతి పురాతన జంతువు పేరుతో న‌మోద‌య్యింది.జోనాథన్ శాకాహారి.క్యాబేజీ, దోసకాయ, క్యారెట్, ఆపిల్, అరటి పండ్లను తిన‌డానికి ఇష్ట‌ప‌డుతుంది.ఇది శీతాకాలంలో సన్ బాత్,వేసవిలో నీడలో ఉండటానికి ఇష్టపడుతుంది.అయితే పెరుగుతున్న వయస్సు ప్రభావం దానిపై స్ప‌ష్టంగా కనిపిస్తుంది.ఫ‌లింగా దాని కంటిచూపు బలహీనంగా ఉండడంతోపాటు వాసన చూసే శక్తి కూడా తగ్గిపోయింది.

ప్రస్తుతం దాని ఆరోగ్యం బాగానే ఉందని వైద్యులు చెబుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube