ఏపీ ప‌ట్ల కేసీఆర్‌ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు ! అస‌లేమ‌న్నారంటే ?

తెలంగాణ సీఎం కేసీఆర్ ఎప్పుడు ఏదో అంశం లేవ‌నెత్తుతూ త‌న‌దైన శైలిలో రాజ‌కీయం చేస్తున్నారు.ఇక ఆయ‌న జాతీయ‌స్థాయిలో రాణించేందుకు ముమ్మ‌ర ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

 Kcr Sensational Comments On Ap Whats The Point Details, Latest Telangana Politi-TeluguStop.com

అక్ర‌మంలోనే అన్ని రాష్ట్రాల విష‌యంలో ప్లాన్ ప్ర‌కారం కామెంట్స్ చేస్తూ వ‌స్తున్నార‌ని టాక్‌.తాజాగా ఏపీ గురించి హాట్ కామెంట్స్ చేయ‌డం ఆస‌క్తిని రేకిత్తిస్తోంది.

ఏపీలోని స‌చివాల‌యం కూడా తెలంగాణ క‌లెక్ట‌రేట్ మాదిరిగా లేద‌ని ఎద్దేవా చేశారు.నాడు పాల‌మూరు ప్రాంతం నుంచి వ‌ల‌స‌లు ఉండేవని, నేడు ఏపీ నుంచి పాల‌మూరుకు వ‌చ్చి ప‌ని చేస్తున్న వ‌ల‌స కూలీల సంఖ్య పెరుగుతోంద‌ని వ్యాఖ్యానించారు.

ఉమ్మ‌డి పాల‌మూరు జిల్లాలో క‌రువు లేకుండా పోయింద‌ని అన్నారు.

వ‌న‌ప‌ర్తి జిల్లాలో స‌మీకృత క‌లెక్ట‌రేట్ భ‌వ‌నం ప్రారంభం అనంత‌రం ఏర్పాటు చేసిన స‌మావేశంలో ఏపీ గురించి ప‌లు వ్యాఖ్య‌లు చేయ‌డం చ‌ర్చ‌కు దారి తీసింది.

జిల్లాలో ఎవ‌రూ ఊహించ‌ని అభివృద్ధి జ‌రుగుతోంద‌ని చెప్పుకొచ్చారు.జిల్లా నుంచే మ‌న ఊరు-మ‌న బ‌డి కి శ్రీకారం చుట్టారు కూడా.ఇదే క్ర‌మంలో ఏపీని తెలంగాణ‌తో పోతుస్తూ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.కొన్ని రాష్ట్రాల్లో స‌చివాల‌యాలు కూడా మ‌న క‌లెక్ట‌రేట్ లా లేవ‌ని అధికారులే చెబుతున్నారంటూ వ్యాఖ్యానించారు.

జిల్లాలో క‌రువు లేద‌ని, పంట‌లు పండుతున్నాయ‌న్నారు.ఇక దేశం తెలంగాణ వైపు చూస్తోంద‌ని ఉపోద్ఘాటించారు.

Telugu Ap Cm Jagan, Ap Sachivalayam, Cm Kcr, Kcr Ap, Manaooru, Telangana, Wanahy

త‌ల‌స‌రి విద్యుత్ వినియోగం, త‌ల‌స‌రి వ్య‌క్తిగ‌త ఆదాయంలోనూ తెలంగాణ ప్ర‌థ‌మ స్థానంలో ఉందంటూ చెప్పుకొచ్చారు.జీఎస్టీలో సైతం తెలంగాణ ముందువ‌రుస‌లో ఉంద‌న్నారు.ఇంటింటికీ న‌ల్లానీరిస్తున్న రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఒక్క తెలంగాణ రాష్ట్రం అంటూ చెప్పారు.ఇక వ‌న‌ప‌ర్తి జిల్లా బంగారుప‌ర్తి కావాలంటూ చెప్పుకొచ్చారు.ఇదంతా బాగానే ఉన్నా… మ‌ధ్య‌లో ఏపీ రాష్ట్రం ప్ర‌స్తావ‌న ఎందుకొచ్చింద‌నే సందేహం ప‌లువురిలో క‌లుగుతోంది. కాగా సీఎం వ్యాఖ్య‌ల వెనుక రాజ‌కీయ ల‌బ్ది ఏమైనా ఉందా అనే అనుమానం కూడా వ‌స్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube