వీడియో: ఏమిటీ చోద్యం... మేక‌పాలు పితికిన పంజాబ్ సీఎం..!

ఇటీవల జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎలక్షన్లలో ఆమ్ ఆద్మీ పార్టీ భారీ మెజారిటీతో గెలుస్తుందని ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి.అయితే పంజాబ్ సీఎం చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ మాత్రం మార్చి 10 వరకు ఆగండి, ఎవరు గెలుస్తారో తెలుస్తుందని అంటూ తనదే గెలుపు అని ధీమాగా చెబుతున్నారు.

 Punjab Cm Charanjit Singh Channi Goat Milking Viral Video Details, Punjab Cm,-TeluguStop.com

ఈ నేపథ్యంలోనే ఆయన ఎవరూ ఊహించని ఓ పని చేసి అందరినీ నివ్వెరపరుస్తున్నారు.

యావత్ భారతదేశ వ్యాప్తంగా పంజాబ్ అసెంబ్లీ ఎలక్షన్ ఫలితాలపై ఉత్కంఠ నెలకొనగా.

ఈ కాంగ్రెస్ లీడర్ మాత్రం చాలా సరదాగా గడుపుతున్నారు.తాజాగా ఆయన మేకపాలు పితికారు.

దీనికి సంబంధించిన వీడియోని స్వయాన ఆయనే తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయడం విశేషం.ఇది క్షణాల్లోనే వైరల్ గా మారింది.

ఈ వీడియో పై నెటిజన్లు సెటైర్లు పేల్చుతున్నారు.దీనికి ఇప్పటికే రెండున్నర లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.

వైరల్ అవుతున్న వీడియోలో సీఎం చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ తన కారు దిగి ఒక మేకల కాపరి వద్దకు రావడం మనం చూడొచ్చు.తర్వాత అక్కడే ఉన్న ఒక నల్ల మేకని పట్టుకుని దాని పాలని ఒక బాటిల్ లో పితకడం గమనించవచ్చు.

అనంతరం బాటిల్ కింద పెట్టి రెండు చేతులతో చాలా ఫాస్ట్ గా మిల్క్ పితికారు సీఎం.దీనిని చూసిన నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.“మీరు ఈ ఎలక్షన్లలో గెలవకపోతే రాహుల్ గాంధీతో కలిసి మిల్క్ బిజినెస్ పెట్టండి.మీకు బాగా సూట్ అవుతుంది” అని ఒక యూజర్ కామెంట్ చేశాడు.

పాలు పితకడానికి నిన్ను సీఎం చేయలేదు.ప్రతి నిమిషం సీఎం ఏదో ఒక మంచి పని చేస్తూనే ఉండాలి.

ప్రజలకు ఉద్యోగావకాశాలు కల్పించాలి, డ్రగ్స్ బెడదను పోగొట్టాలి.ఇలాంటి వాటిపై ఆలోచనలు చేయాలి కానీ ఇలా సమయం వృథా చేయకూడద”ని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.

ఏమిటీ చోద్యం అని ఇంకొందరు ఆశ్చర్యపోతున్నారు.ఈ వీడియోపై మీరు కూడా ఒక లుక్కేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube