కుక్కలు వాసన ద్వారా తమ యజమానిని పసిగడతాయనే వాదనకు భిన్నంగా ఇప్పుడు కొత్త పరిశోధనలు వెలుగుచూశాయి.యజమాని గొంతును గుర్తించి అతని దగ్గరకు చేరుతాయని వివిధ పరిశోధనల్లో తేలింది.
కుక్కలపై పరిశోధన జరిగిన పరిశోధనలకు నాయకత్వం వహిస్తున్న ఆండిక్స్ అటిలా మాట్లాడుతూ కుక్కలు తమ యజమాని గొంతు ఎలా ఉన్నా గుర్తుపట్టగలవని తేలిందని నూతన వాదనను వెల్లడించిన మొదటి పరిశోధన ఇదే అని తెలిపారు.ఈ పరిశోధనలో భాగంగా 28 కుక్కలను వాటి యజమానులతో కలిసి ల్యాబ్‌కు తీసుకువచ్చారు.
హంగేరీలోని బుడాపెస్ట్‌లోని ఐయోట్వోస్ లోరాండ్ యూనివర్సిటీ పరిశోధకులు, 28 కుక్కలను, వాటి యజమానులను ల్యాబ్‌లో దాక్కుని ఆడుకోవడానికి ఆహ్వానించారు.కుక్కలు తమ యజమానులను కనుగొనే పనిలో ఉండగా, కొందరు అపరిచితులను కూడా అక్కడ ఉంచారు.
ఇప్పుడు ఆ కుక్కలకు యజమాని గొంతు, అపరిచితుని గొంతు వినపించారు.యజమాని గొంతును 14 మంది అపరిచితుల స్వరాలతో మిక్స్ చేశారు.82% కేసులలో కుక్కలు తమ యజమానిని కనుగొన్నాయని పరిశోథకులు తెలిపారు.కుక్కలు శబ్దం ద్వారా మాత్రమే యజమానిని గుర్తిస్తాయని, వాసన ద్వారా కాదని శాస్త్రవేత్తలు తెలిపారు.
చివరి రెండు రౌండ్లలో యజమాని స్వరాన్ని వినిపించారు.కుక్కలు ఆ గొంతును గుర్తుపట్టి యజమాని ఎక్కడ ఉన్నాడో గుర్తించాయి.
ఐయోట్వోస్ లోరాండ్ యూనివర్శిటీకి చెందిన ఎథాలజీ విభాగంలోని సీనియర్ పరిశోధకుడు తమస్ ఫరాగో మాట్లాడుతూ ఈ ప్రయోగంలో కుక్కలు వాటి వాసనపై ఎక్కువ ఆధారపడకపోవడం ఆశ్చర్యంగా ఉంందన్నారు.వాయిస్‌లో తేడాలు ఉన్నా కుక్కలు తమ యజమానిని గుర్తించినట్లు పరిశోధకుల బృందం కూడా కనుగొంది.