విజయ్ దేవరకొండ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనన్య పాండే హీరోయిన్ గా చార్మి నిర్మించిన చిత్రం లైగర్.ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది.
సినిమాను ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.దర్శకుడు పూరి జగన్నాథ్ తదుపరి సినిమా జనగణమన ను ప్రకటించిన విషయం తెలిసిందే.
షూటింగ్ పూర్తి చేసిన తర్వాత ఇన్ని నెలలు ఏం చేస్తారా అంటూ ప్రేక్షకులు అసంతృప్తితో ఉన్నారు.ఈ సమయంలో ప్రేక్షకుల్లో మరింత షాక్ కు గురి చేసే ఒక వార్త సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతోంది.
ఆ వార్త ఏంటి అంటే ఈ సినిమాని పూరి జగన్నాథ్ డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ కి ఓకే చెప్పాడు అనేది ఆ వార్త సారాంశం.భారీ మొత్తంలో ప్రముఖ ఓటీటీ వారు ఆఫర్ చేయడంతో ఈ సినిమాను డిజిటల్ స్ట్రీమింగ్ కి ఓకే చెప్పినట్లు గా సమాచారం అందుతోంది.
ఇండస్ట్రీ వర్గాలు మాత్రం పుకార్లు నిజం కాకపోవచ్చు అంటున్నారు.
ఎందుకంటే ఈ సినిమాకు తెలుగు లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా మంచి బజ్ ను కలిగి ఉంది.
కనుక ఇలాంటి సినిమాను ఓటీటీ రిలీజ్ చేయాల్సిన అవసరం లేదు.థియేటర్ రిలీజ్ చేసి భారీ హైప్ వచ్చేలాగా ప్లాన్ చేస్తే ఖచ్చితంగా రికార్డ్ స్థాయి వసూళ్లు నమోదు అయ్యే అవకాశం ఉంటుంది.
కనుక ఏమాత్రం డౌట్ లేకుండా సినిమా థియేటర్ లో నే రిలీజ్ చేస్తారని.ఓటీటీ రిలీజ్ పుకార్లు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అయినా విజయ్ దేవరకొండ సినిమాను ఓటీటీ లో రిలీజ్ చేయడానికి పూరి జగన్నాథ్ అంత తెలివి తక్కువ వాడు ఏమి కాదు అనేది కూడా మీడియా వర్గాల టాక్.అసలు విషయం తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.