ప్రస్తుతం సినిమాలు విడదల చేయాలంటే.దర్శక నిర్మాతలు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు.
పండగల వేళ.లేదంటే సెలవుల సందర్భంగా సినిమాలను రిలీజ్ చేస్తారు.ఒక వేళ ఇతర హీరోల సినిమాలు విడుదల అవుతున్నాయంటే.వారితో పోటీ ఎందుకు అని తమ సినిమాల విడుదల వాయిదా వేస్తున్న సందర్భాలున్నాయి. అగ్ర హీరోలు నటించిన సినిమాల విషయంలోనూ ఇదే తంతు కొనసాగుతుంది.బాలీవుడ్, కోలీవుడ్ టాప్ హీరోల సినిమాలు విడుదల అవుతున్నా.
తమ సినిమాలను కాస్త హోల్డ్ చేస్తున్న సందర్భాలు ఉన్నాయి.సినిమా రిలీజ్ డేట్లు ప్రకటించి కూడా.
వాయిదా వేసిన ఘటనలు చాలా చూశాం.
గతంలో ఎన్టీఆర్ హవా నడుస్తున్న సమయంలో తన సినిమాల విషయంలో ఆయన చూపించే డేర్ ఆశ్చర్యాన్ని కలిగించేదట.
తన సినిమా విడుదలకు సెంటిమెంట్లు, పండగలు, సెలవులు ఏమీ చూసేవారు కాదట దర్శక నిర్మాతలు.సార్ ఇప్పట్లో పండగలు లేవు.
సినిమా ఏమైనా అటు ఇటు అవుతుందా? అని నిర్మాతలు అడితే ఆయన పెద్దగా నవ్వేవారట.మన సినిమా విడుదలే పెద్ద పండుగ బ్రదర్.
ప్రత్యేకంగా ఇంకో పండుగ ఎందుకు అనేవాడట.అంతేకాదు.
సినిమా షూటింగ్ అయిపోతే చాలు.ఇంకా ఎప్పుడు రిలీజ్ అని దర్శక నిర్మాతల వెంట పడేవాడట.
ఎన్టీఆర్ అనుకున్నట్లుగానే ఆయన సినిమాలు మంచి జనాదరణ దక్కించుకునేవట.
ప్రస్తుతం ఇద్దరు టాప్ హీరోల సినిమాలు విడుదల అయితే.పోటీ ఎందుకు అని ఎవరో ఒకరు వెనక్కి తగ్గుతున్నారు.కానీ ఆ రోజుల్లో ఎన్టీఆర్, ఏఎన్నార్ తమ సినిమాలను పోటీ పడి మరీ విడుదల చేసేవారు.
ఈ ఇద్దరు అగ్ర హీరోల సినిమాలు ఒకే సారి విడుదల అయిన సందర్భాలు అనేకం ఉన్నాయి.ఇద్దరి సినిమాలు మంచి విజయాన్ని అందుకున్న సందర్భాలూ ఉన్నాయి.ఎన్టీఆర్ సినిమా విడుదల అవుతుంది అంటే జనాలు ఎంతగానో ఎదురు చూసేవారు.కాలి నడకనో.
ఎడ్ల బండ్ల మీదో వెళ్లి సినిమాలు చూసే వారు.అప్పట్లో ఎన్టీఆర్ కు ఉన్న హవా అలాంటిది అని చెప్పుకోవచ్చు.