ఘంటసాల లాంటి గాత్రంతో కస్టమర్లను ఫిదా చేస్తోన్న టీ కొట్టు యజమాని... ఐఏఎస్ అధికారిణి కూడా ఫిదా!

సోషల్ మీడియా ప్రభంజనం వల్ల ప్రపంచ నలుమూలలా దాగున్న టాలెంట్ లైమ్ లైట్ లోకి వస్తోంది.అత్యంత సాధారణంగా కనిపించే ప్రజలు తమ అసాధారణమైన టాలెంటుతో ఎప్పటికప్పుడు నెటిజన్లను ఆశ్చర్యపరుస్తూనే ఉన్నారు.

 The Owner Of A Teashop Who Is Impress Customers With A Voice Of Gantasala , Tea-TeluguStop.com

తాజాగా మరొక వ్యక్తి తన అద్భుతమైన టాలెంట్ తో ఐఏఎస్ అధికారిణిని కూడా ఫిదా చేస్తున్నాడు.ఇంతకీ ఎవరతను? అతనిలో దాగున్న టాలెంట్ ఏంటి? వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

వైరల్ అవుతున్న వీడియోలో ఒక టీ కొట్టు వ్యక్తి ఒక హిందీ పాట అత్యంత మధురంగా పాడటం మనం చూడొచ్చు.ఆడుతు పాడుతు పనిచేస్తుంటే అలుపూ సొలుపూ లేదులే అన్నట్లుగా ఇతడు హాయిగా తన పనిని ఎంజాయ్ చేస్తూనే పాటలు పాడుతూ కస్టమర్లను సైతం ఫిదా చేస్తున్నాడు.

అతని పాటలు వినడానికి వందల మంది కస్టమర్లు వస్తారంటే అతిశయోక్తి కాదు.అయితే తాజాగా అతనొక పాట పాడుతూ ఉండగా ఒక కస్టమర్ వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

అది కాస్త చాలా వైరల్ గా మారింది.దీన్ని చూసిన సుప్రియ సాహు అనే ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఫిదా అయిపోయారు.దీన్ని ఆమె ట్విట్టర్ వేదికగా షేర్ చేసి అతనిపై పొగడ్తల వర్షం కురిపించారు.

“ఏ పని చేసినా మనం దానిపై మనసు, ఆత్మని కేంద్రీకరించాలి.దీనికి బెటర్ ఎగ్జాంపుల్ గా కోల్‌కతా టీ సెల్లర్ నిలుస్తున్నాడు.ఇతని పేరు పాల్తాన్ నాగ్.ఇతను కిషోర్ కుమార్ సాంగ్స్ మనసుని హత్తుకునేలా పాడుతూ కస్టమర్ల హృదయాలు దోచేస్తున్నాడు.నేను కూడా అతని టీ స్టాల్ కు వెళ్లి సింగింగ్ టీ టేస్ట్ చేసేంతవరకు ఉండలేకపోతున్నాను.” అని సుప్రియ సాహూ పేర్కొన్నారు.ఈ వీడియోకి ఇప్పటికే నాలుగు వేలకు పైగా వ్యూస్ వచ్చాయి.

దీన్ని చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు.ఘంటసాల, మహమ్మద్ రఫీ పాడినట్లుగా అనిపిస్తోందని అతని గానామృతాన్ని పొగిడేస్తున్నారు.

మీరు దీనిపై ఓ లుక్కేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube