ఆ కుట్ర వెనకాల చంద్రబాబు ఉన్నారు అంటున్న వైసీపీ మంత్రి..!!

ఇటీవల కేంద్ర హోం శాఖ ఏపీ ప్రత్యేక హోదా అంశాన్ని తెరపైకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.అంత మాత్రమే కాక ఫిబ్రవరి 17వ తారీకు చర్చకు కూడా పిలవడం జరిగింది.

 Ycp Minister Peddireddy Ramachandra Reddy Says Chandrababu Is Behind The Removin-TeluguStop.com

ఈ ప్రకటన వచ్చిన సాయంత్రం కేంద్ర హోం శాఖ విడుదల చేసిన లిస్టులో ప్రత్యేక హోదా తొలగించడం జరిగింది.అయితే ఏపీ కి స్పెషల్ స్టేటస్ విషయంలో కేంద్రం ఒక్కసారిగా ఈ రీతిలో నిర్ణయం తీసుకోవటం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఇటువంటి తరుణంలో కేంద్ర హోం శాఖ ఏపీ స్పెషల్ స్టేటస్ అంశాన్ని పక్కకు పెట్టడం వెనకాల చంద్రబాబు కుట్ర ఉందని వైసీపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు.

ప్రత్యేక హోదా ఎజెండా నుండి తొలగించటం వల్ల బిజెపి, జనసేన, టీడీపీకే నష్టం అని అన్నారు.

వ్యూహాత్మకంగా చంద్రబాబుకి అన్యాయం జరగకూడదని ఎవరైతే టిడిపి నుండి బీజేపీ లో జాయిన్ అయ్యారో… రాజ్యసభ మెంబర్స్ గా రాణిస్తున్నారో… చంద్రబాబు తాబేదార్లు కేంద్ర హోంశాఖ ఎజెండా నుండి ప్రత్యేక హోదా తొలగించడం లో కీలక పాత్ర పోషించారని ఆరోపించారు.కానీ వైసిపి పార్టీ ఏపీ ప్రత్యేక హోదా కోసం నిరంతరంగా పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.

కచ్చితంగా జనసేన టిడిపి బీజేపీ కలిసి పోటీ చేస్తాయని ముందునుండి అంటూనే ఉన్నాం.ప్రస్తుతం లోపాయికారి ఒప్పందంతో అన్న తరహాలో బీజేపీ వ్యవహరిస్తుంది.

కానీ సీఎం జగన్ ఎప్పటికీ కూడా.ఒంటరిగానే పోటీ చేస్తానని ఏ పార్టీతో వైసిపికి పొత్తులు ఉండవని.

తెలపడం జరిగింది అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు.

YCP Minister Says Chandrababu Is Behind The Conspiracy YCP, Chandrababu - Telugu Chandrababu

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube