ఆ కుట్ర వెనకాల చంద్రబాబు ఉన్నారు అంటున్న వైసీపీ మంత్రి..!!
TeluguStop.com
ఇటీవల కేంద్ర హోం శాఖ ఏపీ ప్రత్యేక హోదా అంశాన్ని తెరపైకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.
అంత మాత్రమే కాక ఫిబ్రవరి 17వ తారీకు చర్చకు కూడా పిలవడం జరిగింది.
ఈ ప్రకటన వచ్చిన సాయంత్రం కేంద్ర హోం శాఖ విడుదల చేసిన లిస్టులో ప్రత్యేక హోదా తొలగించడం జరిగింది.
అయితే ఏపీ కి స్పెషల్ స్టేటస్ విషయంలో కేంద్రం ఒక్కసారిగా ఈ రీతిలో నిర్ణయం తీసుకోవటం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఇటువంటి తరుణంలో కేంద్ర హోం శాఖ ఏపీ స్పెషల్ స్టేటస్ అంశాన్ని పక్కకు పెట్టడం వెనకాల చంద్రబాబు కుట్ర ఉందని వైసీపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు.
ప్రత్యేక హోదా ఎజెండా నుండి తొలగించటం వల్ల బిజెపి, జనసేన, టీడీపీకే నష్టం అని అన్నారు.
వ్యూహాత్మకంగా చంద్రబాబుకి అన్యాయం జరగకూడదని ఎవరైతే టిడిపి నుండి బీజేపీ లో జాయిన్ అయ్యారో.
రాజ్యసభ మెంబర్స్ గా రాణిస్తున్నారో.చంద్రబాబు తాబేదార్లు కేంద్ర హోంశాఖ ఎజెండా నుండి ప్రత్యేక హోదా తొలగించడం లో కీలక పాత్ర పోషించారని ఆరోపించారు.
కానీ వైసిపి పార్టీ ఏపీ ప్రత్యేక హోదా కోసం నిరంతరంగా పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.
కచ్చితంగా జనసేన టిడిపి బీజేపీ కలిసి పోటీ చేస్తాయని ముందునుండి అంటూనే ఉన్నాం.
ప్రస్తుతం లోపాయికారి ఒప్పందంతో అన్న తరహాలో బీజేపీ వ్యవహరిస్తుంది.కానీ సీఎం జగన్ ఎప్పటికీ కూడా.
ఒంటరిగానే పోటీ చేస్తానని ఏ పార్టీతో వైసిపికి పొత్తులు ఉండవని.తెలపడం జరిగింది అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు.
ఇప్పటికీ నాకు గౌరవం దక్కలేదు… అనిల్ రావిపూడి సంచలన వ్యాఖ్యలు!