బాడీ మసాజ్‌కు మార్కెట్‌లో ఎన్నెన్నో ఆయిల్స్ అందుబాటులో ఉన్నాయి.వాటిని కొనుగోలు చేసేందుకు వేలకు వేలకు ఖర్చు పెడుతుంటారు.
కానీ, ఆ ఆయిల్స్ వల్ల లాభాలు మాత్రం పెద్దగా ఉండవు.కానీ, ఇప్పుడు చెప్పబోయే ఆయిల్‌ను వాడితే గానుక ఆరోగ్య పరంగా మరియు సౌందర్య పరంగా బోలెడన్ని ప్రయోజనాలను పొందొచ్చు.
మరి లేట్ చేయకుండా ఆ ఆయిల్ ఏంటీ.? దాన్ని ఎలా తయారు చేసుకోవాలి.? వంటి విషయాలపై ఓ లుక్కేసేయండి.
ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని వాటర్ పోయాలి.
వాటర్ హీట్ అవ్వగానే.దానిపై మరో గిన్నె పెట్టి అందులో ఒక కప్పు జోజోబా ఆయిల్‌ను వేయాలి.
ఆయిల్ వేడి ఎక్కగానే అందులో గుప్పెడు ఎండ బెట్టిన గులాబీ రేకలు, గుప్పెడు ఎండ బెట్టిన మల్లె పూలు వేసి పది నుంచి పదిహేను నిమిషాల పాటు హీట్ చేయాలి.ఆ తర్వాత నూనెను ఫిల్టర్ చేసుకుని బాటిల్‌లో నింపుకోవాలి.
ఇక ఈ ఆయిల్‌తో బాడీ మసాజ్ చేసుకోవడం వల్ల ఒళ్లు నొప్పులు నుంచి ఉపశమనం లభిస్తుంది.ఒత్తిడి, డిప్రెషన్, ఆందోళన వంటి మానసిక సమస్యలు దూరమై మెదడు, మనసు ప్రశాంతగా మారతాయి.
శరీరం బాగా అలసి పోయినప్పుడు ఈ ఆయిల్‌తో మసాజ్ చేసుకుంటే బాడీ ఫుల్ యాక్టివ్‌గా మారుతుంది.
వ్యాయామాలు చేసేటప్పుడు ఒక్కోసారి కండరాలు పట్టేస్తుంటాయి.అలాంటప్పుడు ఈ ఆయిల్‌తో మసాజ్ చేసుకుంటే కండరాలు పట్టివేత నుంచి ఉపశమనం లభిస్తుంది.అంతేకాదు, పైన చెప్పిన ఆయిల్‌ను తయారు చేసుకుని దాంతో బాడీ మసాజ్ చేసుకుంటే.
రక్త ప్రసరణ మెరుగు పడుతుంది.ముచ్చలు, ముడతలు ఉంటే తొలగి పోయి చర్మం ఆరోగ్య వంతంగా, కాంతి వంతంగా మారుతుంది.
మరియు చర్మం ఎల్లప్పుడు తేమగా మరియు యవ్వనంగా ఉంటుంది.