దేవుడా.. పంది కోసం కోర్టుకెక్కిన వ్యక్తి.. చివరికి..?!

సాధారణంగా ప్రజలు కుక్క, పిల్లి, చిలుక, కుందేలు ఇలా రకరకాల జంతువులను పెంచు కుంటారు.కానీ పంది వంటి పెద్ద జంతువులను ఎవరూ పెంచుకోరు.

ఎందుకంటే ఇవి కాస్త పెద్దగా ఉంటాయి.అలాగే చుట్టుపక్కల వారికి ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది.

అందుకే వీటిని పెంపుడు జంతువులుగా ఇంట్లో ఉంచుకోవడానికి ఎవరూ ఇష్టపడరు.కానీ ఒక వ్యక్తి మాత్రం ఒక పందిని అల్లారుముద్దుగా పెంచుకుంటున్నాడు.

దాని కోసం స్పెషల్ గా ఒక రూమ్, పరుపు కూడా ఏర్పాటు చేశాడు.అయితే ఈ విషయం తెలుసుకున్న స్థానిక అధికారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

వరాహం ఒక ఫామ్ జంతువు అని.దానిని ఫామ్‌ హౌస్‌లోనో లేదా ఏదో ఒక అడవిలోనో విడిచి పెట్టాలని బలవంతం చేస్తున్నారు.అలా చేయకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని బెదిరిస్తున్నారు.

అయినా కూడా తనకు ఎంతగానో ఇష్టమైన పందిని వదులు కునేది లేదని సదరు యజమాని భీష్మించుకు కూర్చున్నాడు.దీంతో అధికారులు ఓ అడుగు ముందుకేసి అతడిపై కేసు కూడా పెట్టారు.

అంతే, సదరు యజమానికి చిర్రెత్తుకొచ్చింది.ఇప్పుడు అతడు కోర్టును ఆశ్రయించి న్యాయ పోరాటం చేస్తున్నాడు.ఈ విషయం గురించి తెలుసుకున్న చాలా మంది అవాక్కవుతున్నారు.

వివరాల్లోకి వెళితే.న్యూయార్క్‌లోని మోంట్‌ గోమెరీ కౌంటీలోని కెనాజోహరీ ప్రాంతంలో ఫ్లాట్‌ అనే వ్యక్తి నివసిస్తున్నాడు.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

ఇతడు సుమారు 50 కేజీల బరువు ఉన్న ఓ పందిని చాలా ప్రేమగా పెంచుకుంటున్నాడు.దానికి ఎల్లి అని నామకరణం చేసి తన ఫ్యామిలీ మెంబర్ గా ట్రీట్ చేస్తున్నాడు.

Advertisement

అంతేకాదు ఆ పందితో తన సంతోషాన్ని, బాధని పంచు కుంటున్నాడు.ఆ పంది లేకపోతే తాను బతకలేను అనేంతగా అతడు బాగా ఎటాచ్ అయ్యాడు.

అయితే ఇప్పుడు ఆ పందిని పెంచకూడదని అధికారులు హుకుం జారీ చేయడంతో న్యాయస్థానం మెట్లు ఎక్కాడు.పంది పెంచు కోకూడదని తనని వేధిస్తున్నారని అతడు అధికారులపై క్రిమినల్ కేసు వేశాడు.తన పంది కుక్కల కంటే చాలా తెలివైనదని.

తనకు అది బాగా దగ్గర అయిందని.అలాంటి పందిని తన నుంచి వేరు చెయ్యొద్దని న్యాయస్థానం ముందు అతడు అర్జీ పెట్టుకున్నాడు.

మరి అతడి విజ్ఞప్తిని మన్నించి న్యాయ స్థానం అతడికి శుభవార్త చెబుతుందో లేక నెగిటివ్‌గా తీర్పు ఇస్తోందో చూడాలి.

తాజా వార్తలు