భార్య మంగళ సూత్రం అమ్మి పేకాట.. ఆ వ్యక్తికి పవన్ కళ్యాణ్ చుక్కలు చూపించారా?

పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ప్రస్తుతం ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు రాజకీయాలలో ఫుల్ యాక్టివ్ గా పాల్గొంటున్న విషయం తెలిసిందే.మొన్నటి వరకు సినిమాలతో ఫుల్ బిజీ బిజీగా గడిపిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పూర్తిగా రాజకీయాలపై దృష్టి పెట్టారు.

 Pawan Kalyan Sweet Warning To Sharrath Marar And Trivikram Srinivas Details, , P-TeluguStop.com

ఇకపోతే పవన్ తో సన్నిహితంగా ఉండే కొద్ది మంది వ్యక్తుల్లో శరత్ మరార్( Sharat Marar ) కూడా ఒకరు.నిర్మాతగా శరత్ మరార్ పవన్ తో మల్టిపుల్ చిత్రాలు నిర్మించారు.

సర్దార్ గబ్బర్ సింగ్, గోపాల గోపాల, కాటమ రాయుడు లాంటి చిత్రాలని శరత్ మరార్ నిర్మించారు.

చాలా కాలం పాటు చాలా సినిమాలకు మురార్ పవన్ కళ్యాణ్ తో ట్రావెల్ చేశారు, కాబట్టి పవన్ కళ్యాణ్ మనస్తత్వం ఏంటో శరత్ మరార్ కి బాగా తెలుసు.

ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శరత్ మరార్ పవన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.పవన్ సరిగ్గా నిర్మాతలకు( Producers ) డేట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుంటారనే విమర్శ ఉంది.

దీనిపై శరత్ మరార్ స్పందించారు.పవన్ నిర్మాతలని ఇబ్బంది పెట్టే వ్యక్తి కాదు.

అవసరం అయితే తతానే నష్టపోతాడు తప్ప నిర్మాతలకు నష్టం కలిగించడు.అలాగే డబ్బు విషయంలో కూడా ఆయన ప్లానింగ్ తో ఉండరు.

Telugu Pawan Kalyan, Sharat Marar, Sharath Marar, Tollywood-Movie

డబ్బు విషయంలో ముందు వెనక ఆలోచించమని పిల్లలు ఉన్నారు జాగ్రత్తగా ఉండమని నేను, త్రివిక్రమ్( Trivikram ) ఒకసారి సలహా ఇచ్చి తిట్లు తిన్న విషయాన్ని కూడా శరత్ మరార్ గుర్తు చేసుకున్నారు.అంతే కాకుండా పవన్ కి డబ్బు పై ఆశ లేదు.నేను, త్రివిక్రమ్ చాలాసార్లు చెప్పి చూసాము.ఆయన వినలేదు.డబ్బు ఇచ్చేటప్పుడు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించండి అని నేను త్రివిక్రమ్ చెప్పాను.

దీనికి ఆయన మాకు క్లాస్ పీకారు.నా పిల్లల్ని ఎలా చూసుకోవాలో నాకు తెలుసు మీ టీచింగ్ అవసరం లేదు.

Telugu Pawan Kalyan, Sharat Marar, Sharath Marar, Tollywood-Movie

వాళ్ళు లైఫ్ ని లీడ్ చేయడానికి అవసరమైన స్ట్రెంత్ ఇస్తాను అని పవన్ అన్నారట.అలాగే పవన్ కళ్యాణ్ దగ్గర పనిచేసే వ్యక్తి తన భార్య మంగళ సూత్రం అమ్మేసి మరీ పేకాట ఆడాడు.దీనితో అతడి భార్య పవన్ వద్దకు వచ్చి బోరున ఏడ్చేసింది.దీనితో పవన్ ఆమెకి ధైర్యం చెప్పి ఆర్థికంగా సాయం చేశారట.అంతటితో ఆగకుండా ఆమె భర్తని పిలిపించారు.ఆ రోజు పవన్ కళ్యాణ్ కోపం ఎంత భయంకరంగా ఉంటుందో చూసాను.

వాడికి పవన్ భయం రుచి చూపించారు.పవన్ కళ్యాణ్ ఇచ్చిన వార్నింగ్ తో అతడు మళ్ళీ పేకాట జోలికి వెళ్ళలేదు.

తన పద్ధతి మార్చుకున్నాడు అని శరత్ మరార్ తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube