ఏపీ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా ముద్ర పడ్డ నటి, నగరి ఎమ్మెల్యే రోజా గురించి చాలా మందికి తెలుసు.నగరి నుంచి వైసీపీ జెండా మీద గెలిచిన రోజాకు వైసీపీ ప్రభుత్వంలో మంత్రి పదవి వస్తుందని అందరూ ఊహించారు.
కానీ చివరి నిమిషంలో సామాజిక వర్గాల లెక్కల వలన ఆమెకు మంత్రి పదవి మిస్ అయిందని కూడా చాలా ప్రచారం జరిగింది.మంత్రి పదవి మిస్ అయినా కానీ వైసీపీ ప్రభుత్వం రోజాకు నామినేటెడ్ పోస్టును కట్టబెట్టింది.
దీంతో రోజాను కూల్ చేసే ప్రయత్నం చేసింది.ఇక రోజా తమ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఆకాశానికి ఎత్తుతుంది.
జగనన్నా అంటూ చాలా మర్యాదగా సంభోదిస్తుంది.ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా.
రోజా ప్రస్తుతం పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆకాశానికి ఎత్తుతోంది.ఇంతకీ ఏం జరిగిందంటే.
ఇటీవల రోజా, తన భర్త సెల్వమణితో కలిసి తమిళనాడు సీఎం స్టాలిన్ ను కలిసింది.ఏపీలో ఉంటున్న తమిళుల సమస్యలను పరిష్కరించాలని స్టాలిన్ కు వినతి పత్రం కూడా అందజేసింది రోజా.ఇక ఆ సందర్భంగా తమిళ ముఖ్యమంత్రి స్టాలిన్ ను ఆకాశానికెత్తింది.స్టాలిన్ పాలన చాలా బాగుందంటూ ప్రశంసించింది.స్టాలిన్ ను పొగడ్తల్లో ముంచెత్తించింది.ఇక ఆ ఘటన జరిగిన తర్వాత రోజా తెలంగాణలోని యాదాద్రికి వచ్చింది.
యాదాద్రిని సందర్శించుకున్న రోజా ఇక్కడి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును ఆకాశానికెత్తింది.కేసీఆర్ పాలన చాలా బాగుందని కీర్తించింది.
కేసీఆర్ వల్లే యాదాద్రి గుడి ఇంత బాగా డెవలప్ అయిందని పేర్కొంది.ఇక మరో అడుగు ముందుకేసి కేసీఆర్ ను ఆ దేవుడే పంపాడని కూడా కితాబిచ్చింది.
రోజా వ్యాఖ్యలు చూసి ప్రస్తుతం చాలా మంది ముక్కున వేలేసుకుంటున్నారు.