మొబైల్ ఫోన్ పోయిందా? వెంటనే ఇలా చేయండి..

మొబైల్ ఫోన్ ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే.స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారింది.

 Lost A Mobile Phone Do This Immediately People Complint Theft, Mobile Phone, Th-TeluguStop.com

మొబైల్ ఫోన్‌లలో బ్యాంకింగ్ వివరాలు, వ్యక్తిగత వివరాలు నిక్షిప్తమై ఉంటాయి.అందుకే మొబైల్ ఫోన్ పోయినా లేదా దొంగిలించబడినా ఆందోళన చెందడం సహజం.

ఫోన్ పోయినా లేదా దొంగిలించబడినా దాన్ని పొందడం చాలా కష్టం.అయితే వెంటనే అప్రమత్తమైతే నష్టాన్ని నివారించుకోవచ్చు.

అలా కాకుండా అజాగ్రత్తగా ఉంటే చింతించాల్సివస్తుంది. ఫోన్‌లో బ్యాంకింగ్ వివరాలు సేవ్ చేయబడతాయి.

ఫోన్ పోగొట్టుకున్నప్పుడు ఆన్‌లైన్ మోసాన్ని నివారించడానికి, ముందుగా మీ బ్యాంక్‌ వివరాలు వెల్లడికాకుండా చూసుకోవడం ముఖ్యం.ఈ సమయంలో, ఫోన్ పోగొట్టుకున్న వెంటనే మీరు ముందుగా టెలికాం ఆపరేటర్‌కు కాల్ చేయడం ద్వారా సిమ్ కార్డ్‌ని బ్లాక్ చేయాలి.

తద్వారా దానిని చేజిక్కించుకున్నవారు మీ బ్యాంకింగ్ లేదా వ్యక్తిగత సమాచారాన్ని యాక్సెస్ చేయలేరు.

నిజానికి మీ నంబర్ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్‌తో సహా అనేక అంశాలకు లింక్ చేయబడింది.

దీని కారణంగా సిమ్ కార్డ్ సకాలంలో బ్లాక్ చేయకపోతే, మీ ఖాతాలోని సొమ్మును కొట్టేసేందుకు ఎక్కువ సమయం పట్టదు.అందుకే మొబైల్ వాలెట్ యాక్సెస్‌ను ఆఫ్ చేయండి.

సైబర్ నేరగాళ్లు మీరు కష్టపడి సంపాదించిన డబ్బును తేలికగా లాక్కోగలరు.కాబట్టి మీ ఫోన్ దొంగిలించబడినా లేదా పోగొట్టుకున్నా మీ ఖాతాను యాక్సెస్ చేయడం చాలా సులభమని తెలుసుకోండి.

ప్రస్తుతం ప్రతి ఒక్కరికి పేటీఎం, ఫోన్ పే లాంటి అనేక మొబైల్ వాలెట్లు ఉన్నాయి.వీటి సహాయంతో క్షణాల్లో లావాదేవీలు పూర్తవుతాయి.

అందుకే ఫోన్ పోయినట్లయితే సిమ్ కార్డ్‌ను బ్లాక్ చేయడంతో పాటు మొబైల్ వాలెట్ యాక్సెస్‌ను బ్లాక్ చేయండి.అలాగే ఫోన్ దొంగిలించబడిన లేదా పోగొట్టుకున్న వారు.

సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (CEIR) పోర్టల్ ద్వారా దొంగిలించబడిన లేదా పోగొట్టుకున్న మొబైల్‌ను బ్లాక్ చేయవచ్చు.అలాగే ఫోన్‌ని కూడా ట్రాక్ చేయవచ్చు.

ఈ పోర్టల్‌ను సందర్శించడం ద్వారా, మీరు మీ మొబైల్ నంబర్ మరియు ఐఈఎంఐ నంబర్, ఎఫ్ఐఆర్ నంబర్‌తో సహా కొన్ని ఇతర విషయాలను నమోదు చేయాల్సివుంటుంది.

Lost A Mobile Phone Do This Immediately People Complint Theft, Mobile Phone, Theft , CEIR , Sim Card , Block - Telugu Complint, Immediately, Phone

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube