ఇటీవల రోజుల్లో సిగరెట్ కాల్చే వారి సంఖ్య భారీగా పెరిగి పోతోంది.కొందరు ఒత్తిడి టెన్షన్స్ నుంచి రిలీఫ్ పొందడానికి స్మోక్ చేస్తుంటే.
మరికొందరు ఫ్యాషన్ పేరుతో సిగరెట్లకు అలవాటు పడుతున్నారు.కారణం ఏదైనా ఒక్కసారి స్మోకింగ్‌కు బానిసైతే.
దాన్ని వదిలించుకోవడం ఎంతో కష్టం.ఆరోగ్యం దెబ్బ తింటుందని తెలిసినా సిగరెట్ అలవాటును మాత్రం వదులుకోలేకపోతుంటారు.
అయితే సిగరెట్ కాల్చడాన్ని ఎంతకూ మానేయలేకపోతే ఆరోగ్యంగా ఉండేందుకు కనీసం కొన్ని కొన్ని ఆహారాలైనా డైట్‌లో చేర్చుకోవాలి.మరి స్మోకింగ్ చేసేవారు ఖచ్చితంగా తీసుకోవాల్సిన ఆ ఆహారాలు ఏంటో తెలుసుకుందాం పదండీ.
స్మోకింగ్ చేయడం వల్ల శరీరంలో నికోటిన్ పేరుకుపోతుంది.దాన్ని తొలగించడంలో వెల్లుల్లి, ఉల్లి వంటి వాటిల్లో ఉండే శక్తి వంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ గ్రేట్‌గా సహాయపడుతుంది.అందువల్ల.ఉల్లి, వెల్లుల్లి రెగ్యులర్ డైట్‌లో ఉండేలా చూసుకోవాలి.
అలాగే క్యారెట్, బీట్‌రూట్‌లను కలిపి జ్యూస్ చేసుకుని వారంలో మూడు సార్లు అయినా తీసుకోవాలి.తద్వారా స్మోక్ చేయడం వల్ల దెబ్బ తిన్న లివర్ ఆరోగ్యం కొంతలో కొంతైన మెరుగు పడుతుంది.
స్మోకింగ్ చేసే వారు గుండె జబ్బులకు గురయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి.అయితే గుండె జబ్బుల నుంచి రక్షించుకోవాలంటే డైలీ డైట్‌లో డ్రైఫ్రూట్స్‌ను, డ్రైడ్ ఫ్రూట్స్‌ను ఉండేలా చూసుకోవాలి.
స్మోకింగ్ అలవాటు ఉన్న వారు తరచూ ఆకుకూరలను తీసుకుంటూ ఉండాలి.తద్వారా వాటిల్లో ఉండే బోలెడన్ని పోషకాలు ఎన్నో రకాల జబ్బులు దరి చేరకుండా అడ్డు కట్ట వేస్తాయి.
ఇక ఇవే కాకుండా దానిమ్మ రసం, అల్లం టీ, సిట్రస్ ఫ్రూట్స్, చేపలు, యాపిల్, పసుపు, గుమ్మడికాయ, మిరియాలు, పెరుగు వంటి ఆహారాలు సైతం స్మోకింగ్ ద్వారా కలిగే చెడు ప్రభావాలను తగ్గించి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.