బుల్లితెరపై ప్రసారమయ్యే రియాలిటీ షోలలో బిగ్ బాస్ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈ కార్యక్రమం బుల్లితెరపై వరుస సీజన్లను పూర్తి చేసుకుంటూ దూసుకుపోతోంది.
ఇక తెలుగులో ఇప్పటికే ఐదు సీజన్లలో పూర్తి చేసుకుంది.ఐదవ సీజన్ గ్రాండ్ ఫినాలే రోజున నాగార్జున మరో రెండు నెలలలో మరొక సీజన్ ద్వారా ఈ కార్యక్రమం మీ ముందు ఉంటుందని తెలియజేశారు.
అయితే నాగార్జున చెప్పిన విధంగానే ఈ కార్యక్రమం ఈసారి బుల్లితెరపై కాకుండా ఓటీటీలో ప్రసారం చేయటానికి నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు.
ముందుగా వచ్చిన వార్తల ప్రకారం ఈ కార్యక్రమం ఫిబ్రవరి 20 వ తేదీ ప్రసారం కావాల్సి ఉండగా.
కొన్ని కారణాల వల్ల టెక్నికల్ సమస్యల కారణంగా ఈ కార్యక్రమం ప్రసారం మరొక వారం పాటు వాయిదా వేస్తున్నట్లు వార్తలు వచ్చాయి.అయితే ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి కావడంతో ఈ కార్యక్రమాన్ని ఈ నెల 26వ తేదీ ఎంతో ఘనంగా ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.26వ తేదీ నుంచి ఈ కార్యక్రమం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారం కానుంది.

ఇదివరకు బుల్లితెరపై 24 గంటల పాటు ఈ కార్యక్రమం కొనసాగిన కేవలం గంట మాత్రమే ప్రసారం చేసేవారు.అయితే ఇకపై 24 గంటలు ప్రసారం చేయడానికి నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.ఇక ఎనభై నాలుగు రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుందని ఇదివరకే బిగ్ బాస్ కార్యక్రమాలలో పాల్గొన్న కంటెస్టెంట్ లు కొందరు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలుస్తోంది.
ఇక ఈ కార్యక్రమానికి హోస్ట్ గా నాగార్జున వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే.త్వరలోనే ఈ కార్యక్రమంలో పాల్గొనే కంటెస్టెంట్ లను క్వారంటైన్ పంపించనున్నారు.