1.జిన్నా టవర్ వివాదంపై మేయర్ స్పందన
జిన్నా టవర్ విషయంలో రాజకీయ పార్టీలు అనవసర వివాదానికి తెర తీస్తున్నాయని, ఉద్దేశపూర్వకంగానే వివాదాలు సృష్టిస్తున్నారని గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు అన్నారు.
2.కరోనా పై హైకోర్టు సమీక్ష
తెలంగాణలో కరోనా వైరస్ ప్రభావం తీసుకుంటున్న చర్యలపై హైకోర్టు ఆరా తీసింది విద్యార్థులకు ఆన్లైన్ ద్వారా తరగతులు నిర్వహించాలని సూచించింది.
3.నెహ్రూ జూ పార్క్ లో కొవిడ్ పై నిఘా
నెహ్రూ జూ పార్క్ లో అధికారులు, జంతువుల ఎన్.క్లోజర్ లోకి వైరస్ ప్రవేశించకుండా, ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు.
4. స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడు ఆరోగ్యం విషమం
తిరుమల తిరుపతి దేవస్థానం లో స్నేక్ క్యాచర్ గా పనిచేస్తున్న టీటీడీ ఉద్యోగి భాస్కర్ నాయుడు ఆరోగ్యం విషమించింది.ఇటీవలే ఆయన పాము కాటుకు గురయ్యారు.
5.జిన్నా టవర్ కు ప్రత్యేక స్థానం
గుంటూరులోని జిన్నా టవర్ కు ఒక ప్రత్యేక స్థానం ఉందని సైనికులు అన్ని మతాలకు చెందినవారు ఉంటారని, దీనిని వివాదాస్పదం చేయడం సిగ్గుచేటని ఏపీ హోంమంత్రి సుచరిత అన్నారు.
6.ప్రివిలేజ్ కమిటీ ముందుకు తెలంగాణ పోలీసులు
బిజెపి ఎంపీ తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ పై ఫ్రివిలేజ్ కమిటీ విచారణ చేపట్టింది. ఈ కమిటీ విచారణకు తెలంగాణ పోలీసులు హాజరుకానున్నారు.
7.ఏపీలో 40 చోట్ల సిబిఐ సోదాలు
ఆంధ్రప్రదేశ్ లో సిబిఐ సోదాలు కలకలం సృష్టించాయి.ఏపీలోని ప్రావిడెంట్ ఫండ్ కార్యాలయాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు.
8.ఏపీ లో కరోనా
గడిచిన 24 గంటల్లో ఏపీ వ్యాప్తంగా కొత్తగా 5983 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
9.ఉద్యోగుల పీఆర్సీ కి, ఆర్టీసీ ఉద్యోగుల పి ఆర్ సి కి సంబంధం లేదు
పీఆర్సీ కోసం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సమ్మెకు వెళ్తామని చెప్పారని, ఉద్యోగుల పీఆర్సీ కి , ఆర్ టి సి పి ఆర్ సి కి సంబంధం లేదని ఆర్టీసీ చైర్మన్ మల్లికార్జున్ రెడ్డి చెప్పారు.
10.ఛలో విజయవాడ .ఎక్కడికక్కడ నిర్బంధాలు
ఛలో విజయవాడ కార్యక్రమానికి హాజరవుతున్న ఉద్యోగులను ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకుంటూ నిర్వందిస్తున్నారు.
11.ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోంది : వెంకట రామి రెడ్డి
ప్రభుత్వ ఉద్యోగులకు పిఆర్సి విస్తీర్ణం ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని ఉద్యోగుల సంఘం నేత వెంకట రామి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
12.ఎల్ ఐ సి విషయంపై కేంద్రాన్ని ప్రశ్నించిన ఎమ్మెల్సీ కవిత
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ కు టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సూటి ప్రశ్న వేశారు.లాభాల్లో ఉన్న ఎల్ఐసి ని ఎందుకు అమ్ముతున్నారో చెప్పాలని ఆమె ప్రశ్నించారు.
13.పోలీసులు ప్రభుత్వానికి సహాయ నిరాకరణ చేయాలి
పోలీసులకు పిఆర్సి వర్తిస్తుందని వారు ప్రభుత్వానికి సహాయ నిరాకరణ చేయాలని బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యాఖ్యానించారు.
14.టిఆర్ఎస్ ఎమ్మెల్యే కారు పై గుడ్లతో దాడి
టిఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి వాహనాన్ని అడ్డుకున్న ఎన్.ఎస్.యూ ఐ కార్యకర్తలు ఆయన కారుపై కోడిగుడ్లను విసిరారు.
15.భారత్ లో కరోనా
గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 1.72 లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
16.తిరుపతి ఐఐటీలో ఖాళీల భర్తీ
ఏపీ లోని తిరుపతి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన ప్రాజెక్ట్ ఆఫ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది.
17.యూపీఎస్సీ సివిల్స్ సర్వీసెస్ నోటిఫికేషన్
సివిల్ సర్వీసెస్ 2022, ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ 2022.ఖాళీల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
18.మేడారం జాతరలో కోవిడ్ నియంత్రణపై హైకోర్టు సూచనలు
మేడారం జాతర నిర్వహణలో కోవిడ్ నిబంధనలు అమలు గురించి ప్రభుత్వానికి హైకోర్టు అనేక సూచనలు చేసింది.
19.యాదాద్రి పై మంత్రి హరీష్ రావు కామెంట్స్
దేశంలోనే గొప్ప పర్యాటక ప్రాంతంగా యాదాద్రి దేవాలయం మారబోతోందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు అన్నారు.
20.ఈరోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 45,500
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 49,650
.