UPI ట్రాన్సాక్షన్స్ జరిపేవారికి శుభవార్త.. ఇక మీరు కొన్నాళ్లపాటు నిశ్చింతగా ఉండవచ్చు.!

భారత కేంద్ర ప్రభుత్వం చిన్నకారు వ్యాపారులకు ఓ శుభవార్త తీసుకు వచ్చింది.అవును.

 Central Government Good News For Small Businesses Over Upi And Rupay Transactio-TeluguStop.com

ఇప్పుడు దేశవ్యాప్తంగా పేమెంట్ ప్లాట్‌ఫామ్‌లు అయినటువంటి UPI (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్) మరియు రూపేలు ఇంకో ఏడాది పాటు చిరు వ్యాపారులకు, దుకాణ దారులకు ఫ్రీగా ఇవ్వనున్నట్టు నిర్ణయం తీసుకోవడం శుభపరిణామం.ఇక పూర్తి వివరాలు పరిశీలించినట్లయితే, ఆర్థిక సంవత్సరం 2023లో డిజిటల్ పేమెంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు ఆర్థిక సాయాన్ని ఇవ్వాలని కేంద్రం యోచిస్తోంది.

ఈ క్రమంలో చిన్న వర్తకులకు కూడా మరో సంవత్సరంపాటు ఈ సేవలు ఉచితంగా అందిస్తున్నట్టు చెప్పింది కేంద్రం.ఇక గత ఏడాది బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం UPI, రూపే మర్చెంట్ లావాదేవీలపై బ్యాంకులకు జీరో ఫీజుల విషయంలో పరిహారం ఇచ్చిన సంగతి తెలిసినదే కదా.ఇక్కడ మర్చెంట్ డిస్కౌంట్ రేటు అనేది డిజిటిల్ పేమెంట్స్ ని ఇస్తున్నందుకు బ్యాంక్స్ కి చెల్లించే చార్జీల తాలూక అంశం.దుకాణదారులు వీటిని బ్యాంకులకు చెల్లించాల్సి వుంది.

కానీ ఈ చెల్లింపులను ఇచ్చే ఫిన్‌టెక్ కంపెనీలకి మాత్రం ఎలాంటి ఆదాయం ఉండదు.కేవలం వారు ఫ్రీగా అందించి ప్రోత్సహిస్తారు.

Telugu Banks, Central, Kirana, Upi Rupay, Zero Fee-General-Telugu

ఇకపోతే.దేశవ్యాప్తంగా డిజిటల్ పేమెంట్స్ స్వీకరణను పెంచేందుకు ఈ ఇండస్ట్రీకి ఆర్థిక మద్దతును ఇస్తుంది.ఇక్కడ జీరో MDR వల్ల చిరు వ్యాపారులకు, కిరాణా దుకాణదారులకు కూడా మేలు చేకూరనుంది.అలాగే రిటైల్ చెయిన్ల కంటే ఎక్కువగా చిన్న దుకాణదారులకు జీరో MDR ఛార్జీలు బెనిఫిట్ గా మారనున్నాయి.

కాబట్టి ఇకనుండి దాదాపు ఓ సంవత్సరం కాలం పాటు చిరు వ్యాపారులు, కిరాణా దుకాణదారులు నిశ్చింతగా ఉండవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube