ముల్తానీ మట్టిని ముఖానికి ప్యాక్ గా వేసుకున్నప్పుడు గట్టిగా ఉంటుంది.దాంతో ముల్తానీ మట్టిలో ఉండే కాంపౌండ్స్ మృత కణాలను తొలగిస్తాయి.
అంతేకాక చర్మం లోపల ఉన్న నూనె ,సీబమ్ లను తొలగించటంలో కూడా సహాయపడతాయి.అలాగే ముల్తానీ మట్టిలో ఉన్న గుణాలు చర్మం పొడిబారకుండా ఉండేలా చేస్తాయి.
చర్మంపై మలినాలను తొలగించటానికి కూడా బాగా సహాయపడతాయి.ముల్తానీ మట్టిలో రోజ్ వాటర్, గంధం పొడి వేసి బాగా కల్పి పేస్ట్ గా చేసుకొని నల్లగా ఉన్న మెడ ప్రాంతంలో రాస్తే క్రమంగా మెడ మీద ఉన్న నలుపు పోతుంది.
ఈ విధంగా వారానికి ఒకసారి చేస్తే సరిపోతుంది.
ముల్తానీ మట్టిలో ఉండే మినరల్స్ నల్లని మచ్చలను తొలగించటంలో సహాయపడతాయి.
దీని కోసం ఒక ప్యాక్ ని తయారుచేసుకోవాలి.ముల్తానీ మట్టిలో పెరుగు కలిపి అరగంట తర్వాత పుదీనా పొడి వేసి కలిపి పేస్ట్ గా చేసుకోవాలి.
ఈ పేస్ట్ ని నల్లమచ్చలు ఉన్న ప్రదేశంలో రాసి అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.ముల్తానీ మట్టిలో ఆలివ్ ఆయిల్, క్యారట్ గుజ్జును సమాన భాగాలుగా తీసుకుని ముఖంపై ప్యాక్ లా వేసుకుని 15 నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి.
రెండు స్పూన్ల ముల్తానీ మట్టిలో ఒక స్పూన్ వేపాకు పేస్ట్, చిటికెడు కర్పూరం పొడి,రోజ్ వాటర్ కలిపి పేస్ట్ గా చేయాలి.ఈ పేస్ట్ ని మొటిమలు ఉన్న ప్రదేశంలో రాస్తే తొందరగా తగ్గుముఖం పడతాయి.
రెండు స్పూన్ల ముల్తానీ మట్టిలో ఒక స్పూన్ టమోటా జ్యుస్,పావు స్పూన్ని మ్మరసం,ఒక స్పూన్ తేనే వేసి బాగా కలిపి ముఖానికి రాసి అరగంట తర్వాత శుభ్రం చేసుకుంటే జిడ్డు సమస్య నుండి బయట పడవచ్చు.