పుష్ప-2లో ఈ ముదురు భామ ఐటెం సాంగ్ చేస్తుందట..

మాళవిక. ఒకప్పుడు తెలుగు సినిమాల్లో మంచి గుర్తింపు పొందిన హీరోయిన్.

 Malavika About Pushpa 2 Item Song Details, Actress Malavika, Alitho Saradaga Sho-TeluguStop.com

శ్రీకాంత్, వడ్డే నవీన్ కలిసి చేసిన చాలా బాగుంది సినిమాతో తెలుగు జనాలకు చేరువైంది ఈ ముద్దుగుమ్మ.తెలుగులో తక్కువ సినిమాలే చేసినా మంచి పేరు అందుకుంది.తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ పలు సినిమాలు చేసింది.2009లో చివరగా సినిమా చేసింది.ఆ తర్వాత చిత్ర పరిశ్రమకు దూరం అయ్యింది.సుమారు పుష్కర కాలం తర్వాత మళ్లీ జనాల ముందుకు వచ్చింది.తాజాగా అలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొంది.

ఈ కార్యక్రమంలో తన సినిమా జర్నీ గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

అంతేకాదు.ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో జనాల్లోకి వచ్చింది.

ఇందులో ఆమె చెప్పిన విషయాలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి.సినిమాల్లో తన అనుభవం గురించి, సినిమా పరిశ్రమలో తాను పడిన బాధలు, ఎదురైన ఇబ్బందులను ప్రస్తావించింది.

ఈ ఎపిసోడ్ త్వరలో జనాల ముందుకు రానుంది.ఇందులో భాగంగా అలీ ఆమెను కొన్ని ప్రశ్నలు వేశాడు.

ఇటీవల ఏ సినిమా చూశారని ప్రశ్నించాడు.దానికి మాళవిక పుష్ప సినిమా చూసినట్లు చెప్పింది.

ఈ సినిమా తనకు బాగా నచ్చిందని వెల్లడించింది.

అంతేకాదు.ఈ సినిమాలో సమంతా చేసిన ఐటెం సాంగ్ ఊ అంటావా మావా.ఊ ఊ అంటావా సాంగ్ తనను ఎంతో బాగా ఆకట్టుకుందని చెప్పింది.

ఆ ఆఫర్ తనకు వచ్చినా చేస్తానని వెల్లడించింది.అక్కడే కూర్చుని ఈ సినిమాకు సంబంధించిన స్టెప్పులు కూడా వేసింది.

ఆమె డ్యాన్సును అలీ కూడా చాలా అభినందించాడు.అటు బన్నీ పుష్ప పార్ట్-2 లో ఐటెం సాంగ్ ఉంటే మాళవిక చేస్తుందంటాడు అలీ.మొత్తంగా పుష్ప సినిమా ఐటెం సాంగ్ కు ఏ రేంజిలో క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.ఈ వీడియోను పలువురు బన్నీ అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

Malavika About Pushpa 2 Item Song Details, Actress Malavika, Alitho Saradaga Show, Pushpa Part 2, Pushpa Item Song, Samantha, Comedian Ali, Actress Malavika, Tollywood Senior Actress, Allu Arjun, Rashmika - Telugu Alithosaradaga, Allu Arjun, Ali, Malavika, Pushpa Item, Pushpa, Rashmika, Samantha, Tollywoodsenior

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube