డబ్ల్యుడబ్ల్యుఈ పోరాటాలను మీరు టీవీలో చూసే ఉంటారు.ఎంతో ఆసక్తికరంగా సాగే ఈ పోరాటాలకు సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
డబ్ల్యుడబ్ల్యుఈ పూర్తి రూపం వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్‌టైన్‌మెంట్.దీని ప్రధాన కార్యాలయం ఈస్ట్ మెయిన్ స్ట్రీట్, స్టాంఫోర్డ్ (యూఎస్ఏ)లో ఉంది.డబ్ల్యుడబ్ల్యుఎఫ్‌పేరు 2002లో డబ్ల్యుడబ్ల్యుఈగా మార్చబడింది.చాలా సందర్భాల్లో డబ్ల్యుడబ్ల్యుఈ గేమ్‌లో ఓడిపోయిన వ్యక్తి ఎక్కువ డబ్బు పొందుతాడు.డబ్ల్యుడబ్ల్యుఈ రింగ్ కింద మైక్ ఉంటుంది.తద్వారా రెజ్లర్ల వాయిస్ వినబడుతుంది.
డబ్ల్యుడబ్ల్యుఈ పోరాటాలలో చాలా సందర్భాలలో నిజమైన రక్తం కళ్లజూస్తారు.డబ్ల్యుడబ్ల్యుఈ గేమ్‌లో ఎవరు గెలుస్తారో ముందుగానే నిర్ణయమవుతుంది.అయినప్పటికీ అది నిజమైన పోరాటంగానే కొనసాగుతుంది.శారీరక ధారుఢ్యాన్ని పెంచుకోవడానికి మల్లయోధులు డ్రగ్స్ తీసుకోకుండా నిరోధించడానికి డబ్ల్యుడబ్ల్యుఈ ఒక వెల్నెస్ పాలసీని రూపొందించింది.రాయల్ రంబుల్‌లో ఎక్కువ కాలం జీవించి ఉన్న రెజ్లర్ రే-మిస్టీరియో.1988 సంవత్సరంలో మాజీ రెజ్లర్ హల్క్ హొగన్- ఆండ్రీ జెయింట్స్ మధ్య ఒక మ్యాచ్ జరిగింది.సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లో అత్యధికంగా వీక్షించబడిన మ్యాచ్ ఇది.లెజెండరీ రెజ్లర్ అండర్‌టేకర్ తన ప్రొఫెషనల్ రెజ్లింగ్ కెరీర్‌లో తన పేరును 6 సార్లు మార్చుకున్నాడు.అండర్‌టేకర్ తన 25 సంవత్సరాల కెరీర్‌లో వరుసగా 21 రెజిల్‌మేనియాను గెలుచుకున్నాడు.