యంగ్ టైగర్ ఎన్.టి.
ఆర్ తన నెక్స్ట్ 10 సినిమాల డైరక్టర్స్ ని ఫిక్స్ చేసుకున్నాడా.ఆర్.
ఆర్.ఆర్ తో 29వ సినిమా చేస్తున్న తారక్ 30వ సినిమా నుండి 40 వ సినిమా వరకు ఏ సినిమా ఏ డైరక్టర్ తో చేస్తాడన్నది ఓ లిస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఒకటి రెండు కాదు ఏకంగా 10 సినిమాలు 10 మంది దర్శకుల పేర్లు ఈ లిస్ట్ లో ఉన్నాయి.ఎన్.టి.ఆర్ తీయబోయే నెక్స్ట్ పది సినిమాల్లో స్టార్ డైరక్టర్స్ తో పాటుగా బాలీవుడ్ క్రేజీ డైరక్టర్స్ కూడా ఉన్నారు.అయితే ఇది ఎన్.టి.ఆర్ టీం రివీల్ చేసిన న్యూసా లేక ఫిల్మ్ నగర్ చర్చల్లో జరుగుతున్న న్యూస్ ప్రకారంగా సృష్టించిన గాసిప్పా అన్నది పక్కన పెడితే ఎన్.టి.ఆర్ నెక్స్ట్ 10 సినిమాల లిస్ట్ మాత్రం అదిరిపోయింది.
ఆర్.
ఆర్.ఆర్ ఎన్.టి.ఆర్ కెరియర్ లో 29వ సినిమా కాగా కొరటాల శివ సినిమా ఎన్.టి.ఆర్ 30వ సినిమాగా వస్తుంది.ఇక ఆ సినిమా తర్వాత ఎన్.టి.ఆర్ 31వ సినిమా బుచ్చి బాబు సన డైరక్షన్ లో ఉంటుందని టాక్.ఉప్పెనతో ఓ రేంజ్ హిట్ అందుకున్న బుచ్చి బాబు తన డైరక్షన్ లో తారక్ తో భారీ మూవీ ప్లాన్ చేసిన విషయం ఇప్పటికే లీక్ అయ్యింది.
ఇక 32వ సినిమా కె.జి.ఎఫ్ ప్రశాంత్ నీల్ తో ఉంటుందని టాక్.33వ సినిమా తమిళ దర్శకుడు అట్లీతో తారక్ సినిమా ఉంటుందట.
34వ సినిమా త్రివిక్రం తో 35వ సినిమా సంజయ్ లీలా భన్సాలీతో ఉంటుందని టాక్.36వ సినిమా తమిళ దర్శకుడు వెట్రిమారన్ తో.37వ సినిమా తరుణ్ భాస్కర్ తో.38వ సినిమా సుకుమార్ తో ఉంటుందని టాక్.39వ సినిమా లోకేష్ కనకరాజ్ తో.40వ సినిమా మళ్లీ ఎస్.ఎస్ రాజమౌళి డైరక్షన్ లో ఉంటుందని తెలుస్తుంది.మరి ఇదే లిస్ట్ అయితే మాత్రం ఎన్.టి.ఆర్ సినిమాల హంగామా ఓ రేంజ్ లో ఉంటుందని చెప్పొచ్చు.