మహబూబ్ బాద్: బయ్యారం లో నిరుద్యోగంతో ఆత్మహత్య చేసుకున్న ముత్యాల సాగర్ కుటుంబంను పరామర్శించి, ఆర్థిక సాయం అందజేసిన ఈటల రాజేందర్. మహబూబ్ బాద్ జిల్లా బీజేపీ నేతలు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.ఊళ్లలో కూరగాయలు అమ్ముకునే తల్లి.
ఆటో నడుపుకునే తండ్రి వాళ్ళ పేదరికం వాళ్ళ కొడుకులకు వారసత్వం గా ఇవ్వకుడదని.ఎంతో కష్టపడి చదివించి, వాళ్ళకు ఉద్యోగం వస్తె మురిసిపోదాం అనుకుంటారు.
కానీ తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయి, తమలాంటి వారి బ్రతుకులు బాగుపడతాయి అని వందల మంది విద్యార్థులు ఆత్మబలిదానాలు చేసుకున్నారు.మానుకోటలో బుల్లెట్ల వర్షం కురిపిస్తే.
రక్తం చిందించి అడ్డు నిలిచిన వాళ్ళు కూడా విద్యార్థులే.
తెలంగాణ వచ్చిన తరువాత.
కేసీఆర్ రెండవ సారి ముఖ్యమంత్రి పదవి అధిష్టించిన తరువాత ఒక్క నోటిఫికేషన్ విడుదల చేయలేదు.ఒక్క ఉద్యోగం భర్తి చేయలేదు.
చదువు ముగించుకొని 5 నుండి 10 సంవత్సరాలు ఎంతో డబ్బు ఖర్చుపెట్టి కోచింగ్ తీసుకొని.నోటిఫికేషన్లు పడక గుండె పగిలి చనిపోతున్నారు.
ఆనాడు తెలంగాణ రావడం కోసం విద్యార్థులు బలిదానం చేసుకున్నారు.ఈనాడు ఉద్యోగాల కోసం ఆత్మహత్య లు చేసుకుంటున్నారు.
Mlc ఎన్నికల్లో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానని అని చెప్పి కెసిఆర్ నిమ్మకునీరెత్తినట్టు ఉన్నారు.నిరుద్యోగులు అందరూ అలజడులో ఉన్నారు.
ఉస్మానియా లో అనేక మంది మీద ఈ రోజు అక్రమ కేసులు పెట్టారు.వారిని వెంటనే విడుదల చేయాలి.ఆత్మహత్యలు పరిష్కారం కాదు.ముత్యాల సాగర్ కుటుంబాన్ని ఆదుకుంటామని MRO హామీ ఇచ్చారు ఆ హామీని వెంటనే నెరవేర్చాలి.సీఎం గారు వెంటనే స్పందించి ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వాలి.ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో ఉన్నవారికే కొంత జీతాలు పెంచి ఉద్యోగాలు ఇచ్చామని అంటున్నారు.11సంవత్సరాలుగా గ్రూప్ 1 నోటిఫికేషన్ లేదు.
సీఎం గారు భేషజాలకు పోకుండా.ఆత్మహత్యలు చేసుకోకుండా ఉండాలంటే వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలి.బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు అని నేను కూడా పాదయాత్ర చేసిన… కేటీఆర్ గారు ఇక్కడికి వచ్చి కేంద్రం పెట్టకపోతే మేమే ప్లాంట్ పెడతా అన్నారు మరి ఏమైంది.
మంచి అయితే వీళ్ళ ఖాతాలో వేసుకుంటారు, చెడు అయితే కేంద్రం ఖాతాలో వేస్తారు.మేము ఢిల్లీ గులాంలం కాదు అని కెసిఆర్ చెప్తారు కదా మరు ఈ తెలంగాణ విద్యార్థులను ఆదుకోమని చెప్తే ఢిల్లీ పాట పాడడం ఏంటి.
ఇతరుల మీద నెపం నెట్టడంమాని వేసి కెసిఆర్ ఏం చేస్తారో చెప్పాలి.